- Home
- Entertainment
- Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్ లో సందడి చేస్తోంది. మహేష్ బాబు వారణాసి మూవీ షూటింగ్ లో ఆమె బిజీగా ఉంది. అయితే షూటింగ్ గ్యాప్ లో ప్రియాంక చోప్రా సమ్మర్ ని ఎంజాయ్ చేస్తోంది.

‘వారణాసి’ షూటింగ్‌తో ప్రియాంక చోప్రా బిజీ
హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్‌తో ప్రియాంక చోప్రా బిజీగా ఉంది. అయినా వీకెండ్‌లో తనకోసం కొంత సమయం కేటాయించుకుంది. పూల్‌లో రిలాక్స్ అవ్వడం, స్కిన్‌కేర్, నేరేడు పండ్లు తినడం వంటి తన సండే రొటీన్‌ను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెమెరాలకు దూరంగా..
బ్లాక్ స్విమ్ వేర్ లో సమ్మర్ హీట్ పెంచేసిన పీసీ
వైరల్ వీడియో
ప్రియాంక కేవలం ఫోటోలే కాదు, తన స్విమ్మింగ్ సెషన్‌కు సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె పూల్‌లో సరదాగా గడుపుతూ కనిపించింది. ఆమె నాచురల్, అన్‌ఫిల్టర్డ్ లుక్‌ను అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు.
సెల్ఫ్ కేర్‌కు ప్రాధాన్యం
సండే సెల్ఫ్ కేర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, ప్రియాంక తన స్కిన్‌కేర్ రొటీన్ ఫోటోలను కూడా పంచుకుంది. ఒక ఫోటోలో ఆమె ఫేస్ మాస్క్ వేసుకొని కనిపించింది. మెరిసే చర్మం కోసం ఆమె చేసే ఈ సెల్ఫ్ కేర్ యాక్టివిటీ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది. ప్రియాంక తరచుగా తన వెల్‌నెస్, బ్యూటీ రొటీన్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ప్రియాంక నేరేడు పండ్లు తింటున్న ఫోటోలు
పూల్, స్కిన్‌కేర్‌తో పాటు, ప్రియాంక నేరేడు పండ్లు తింటున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. విదేశీ ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ ఉన్నప్పటికీ, ఆమెలోని ఈ దేశీ యాంగిల్ అభిమానులకు బాగా నచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ఆమె సింప్లిసిటీని, భారతీయ పండ్లపై ఆమెకున్న ఇష్టాన్ని మెచ్చుకున్నారు.

