MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • OTT Movies: ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ

OTT Movies: ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ

ఈవారం ఓటీటీ ఆడియన్స్ కి వినోదాల విందు ఉండబోతోంది. వరల్డ్ ఫేమస్ బ్యూటీ జెన్నిఫర్ లోపేజ్ నటించిన రొమాంటిక్ మూవీ ఆఫీస్ రొమాన్స్, బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ధురంధర్ 2 లాంటి చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 01 2026, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ భారీగా ఉండబోతోంది. క్రైమ్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, యాక్షన్ మూవీస్ ఇలా అన్ని జానర్లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ 5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇవే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Netflix
Image Credit : Asianet News

Netflix

Maa Behen

త్రిప్తి డిమ్రి, మాధురి దీక్షిత్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. విచిత్రమైన కథనం, ఆసక్తికరమైన పాత్రలు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 4

Dhurandhar: The Revenge

2025లో వచ్చిన స్పై థ్రిల్లర్‌కు ఇది సీక్వెల్. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ ‘Raw & Undekha’ వెర్షన్ ఇప్పటికే విదేశాల్లో స్ట్రీమింగ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఇండియాలో డిజిటల్ ప్రీమియర్‌కు వస్తోంది.

ఎక్కడ చూడాలి: Netflix, JioHotstar

రిలీజ్ డేట్: జూన్ 4

Office Romance

జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ. ఆఫీస్‌లో సీక్రెట్ రిలేషన్‌షిప్ వల్ల ఇద్దరు వర్కహాలిక్స్ జీవితాల్లో వచ్చే గందరగోళం కథాంశంగా ఉంటుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 5

Mexico 86

1986 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మెక్సికో ఎలా నిర్వహించిందన్న అంశం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డియాగో లూనా, డేనియల్ గిమెనెజ్ కాచో, కార్లా సౌజా కీలక పాత్రల్లో నటించారు.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 5

Teach You A Lesson

పాఠశాలల్లో క్రమశిక్షణ పూర్తిగా కూలిపోయిన పరిస్థితుల్లో, విచిత్రమైన ఇన్‌స్పెక్టర్లు ఎంట్రీ ఇచ్చి వ్యవస్థను ఎలా మార్చారన్న కథతో ఈ K-డ్రామా రూపొందింది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 5

The Marked Woman

ఒక మహిళ షిప్పింగ్ కంటైనర్‌లో గుర్తు తెలియని స్థితిలో కనిపించడంతో కథ మొదలవుతుంది. ఆమె ఎవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారు? అనే మిస్టరీ చుట్టూ సిరీస్ తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 5

29

విధు, ప్రీతి అస్రాని నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా. థియేటర్లలో మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు OTTలో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: జూన్ 5

36
ZEE5
Image Credit : Asianet News

ZEE5

Patriot

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభుత్వ డిఫెన్స్ స్పైవేర్ దుర్వినియోగాన్ని బయటపెట్టేందుకు పరారైన మాజీ అధికారిపై కథ సాగుతుంది.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: జూన్ 5

Brown

కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఓ పోలీస్ ఆఫీసర్ సీరియల్ కిల్లర్‌ను ఎలా వెంబడించిందన్నది కథ.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: జూన్ 5

KD The Devil

ధ్రువ సర్జా నటించిన కన్నడ యాక్షన్ మూవీ. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు OTTలోకి వస్తోంది.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: జూన్ 5

46
SonyLIV
Image Credit : Asianet News

SonyLIV

Gullak Season 5

ఫ్యామిలీ డ్రామా సిరీస్‌గా మంచి పేరు తెచ్చుకున్న Gullak కొత్త సీజన్‌తో తిరిగి వస్తోంది. ఈసారి అనంత్ జోషి, అను మిశ్రా పాత్రలో కనిపించనుండగా, మిశ్రా కుటుంబ కథ మరింత ముందుకు సాగనుంది.

ఎక్కడ చూడాలి: SonyLIV 

రిలీజ్ డేట్: జూన్ 5

56
Prime Video
Image Credit : Asianet News

Prime Video

The Pyramid Scheme

త్వరగా డబ్బు సంపాదించాలని ఆశపడే ఓ యువకుడు పిరమిడ్ మార్కెటింగ్ వ్యాపారంలోకి దిగిన తర్వాత అతని జీవితం ఎలా మారిందన్నది కథ. పరమ్‌వీర్ చీమా, రణ్‌వీర్ షోరీ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: జూన్ 5

66
MX Player
Image Credit : Asianet News

MX Player

Made In India: A Titan Story

Titan బ్రాండ్ ఎదుగుదల వెనుక ఉన్న కథ ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. నసీరుద్దీన్ షా, జేఆర్‌డీ టాటా పాత్రలో నటించగా, జిమ్ సర్భ్ జెరక్సెస్ దేశాయ్ పాత్రలో కనిపించనున్నారు.

ఎక్కడ చూడాలి: MX Player 

రిలీజ్ డేట్: జూన్ 3

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved