చెల్లెలి పెళ్లికి ప్రియాంక చోప్రా డుమ్మా.. ఘనంగా పరిణితి చోప్రా - రాఘవ్ చద్దా వివాహ వేడుక
చెల్లెలు పెళ్ళికి డుమ్మా కొట్టింది బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. తన సోదరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి పెళ్లి ఘనంగా జరగడా.. ఆ పెళ్లికి రాలేకపోయింది.
Parineeti chopra, Raghav Chadha,
ఇక వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, లాంటి స్టార్స్, తదితరులు పెళ్లికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి భారీగా ఖర్చు పెట్టారు జంట. కోట్లలో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా వచ్చినవారి మర్యధలకు, హోటల్ రూమ్స్ కు .. ఆతిథ్యానికి.. డెకరేషన్, కాస్ట్యూమ్స్, జువ్వల్లరీ.. తదితరాలు చూసుకుంటే.. కోట్లలో ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో పరిణితి పెళ్ళికి పక్కాగా వస్తారు అనుకున్న ఇద్దరు గెస్ట్ లు మాత్రం ఆప్సెంట్ అయినట్టు తెలుస్తోంది. అందులో పరిణితి సోదరి ప్రియాంక చోప్రా, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.
అయితే పరిణీతి చోప్రాకు కజిన్ సిస్టర్ అయిన ప్రియాంక చోప్రా, ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ లు పెళ్లికి హాజరుకాలేదు. ఈ విషయం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చెల్లి పెళ్లికి అక్క రాకపోవడానికి గల కారణాలపై నెటీజన్లు ఆరా తీస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీతో కలిసి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి హాజరవుతుందని వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి.
అయితే ప్రియాంక చోప్రా మాత్రం తాను ఈ పెళ్ళికి రావడం లేదంటూ..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు అంతే కాదు..కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అనుకున్న విధంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ బాలీవుడ్ కపుల్స్ పెళ్ళి ఘనంగా జరిగింది.
ఇక వీరిద్దరు కలిసి ఇండస్ట్రీతో పాటు... రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొంత కాలంగా వీరు రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఎవిరికీ ఈ విషయం తెలియదు. ఆమధ్య బయట రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ... కెమెరాల కంట పడ్డారు. అప్పటి నుంచి వీరి మీద మీడియా నిఘా ఉండటంతో.. అసలు విషయం బయటకు వచ్చింది.
అయితే.. కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి ప్రియాంక హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెల్లి పెళ్లికి రాకుండా అక్కడకు వెళ్లడం ఎందుకు అని నెటీజన్లు ప్రియాంక తీరుపై మండిపడుతున్నారు.
రాఘవ్, పరిణీతి ఒకే స్కూల్ చదువుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్ పరిణీతి రాణిస్తుంది. మరోవైపు రాఘవ్ చద్దా యువ ఎంపీగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు కలిసేతిరుగుతున్నారు. ఆ మధ్య పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ని కలిసి తిలకించడం విశేషం.