గ్రాండ్ గా ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ కుమార్తె పుట్టినరోజు పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు
అటు సినిమాలు ఇటు ఫ్యామిలీ లైఫ్ రెండింటిని బాగా బ్యాలన్స చేస్తోంది హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా తనగారాల పట్టి బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఆఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వలస వెళ్లింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ పై ఫైర్ అవుతూ.. ఎప్పుడో ఒకక సారి ఇక్కడికి వచ్చి.. బాలీవుడ్ సినిమాలు చేస్తూ... సందడి చేస్తోంది ప్రియాంక. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అరాచకం అంతా ఇంతా కాదు.
తన ఫ్యామిలీకి సబంధించిన ఏ విషయం అయినా.. సోషల్ మీడియా పేజీలో అప్ డేట్ చేస్తుంటుంది బ్యూటీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఈవెంట్స్ ను అస్సలు మిస్ అవ్వదు. తన భర్త .. కూతురుతో గడిపిన మధుర క్షణాలు ఎన్నో నెట్టింట అప్ డేట్ ఇస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా తన కూతురు మాల్డీ మేరీ సెకండ్ బర్డ్ డే కు సబంధించి ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది బ్యూటీ.
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో, లిటిల్ ఏంజెల్ మాల్దీ గులాబీ రంగు స్వెటర్ మరియు ఎరుపు ప్యాంటు వేసుకుని కనిపించింది. తలపై అందమైన కిరీటాన్ని పెట్టికుని బ్రిటన్ మహారాణిమాధిరి తయారయ్యింది. చిన్నారిని చూసి మురిసిపోయారు ప్రియాంక, నిక్ లు.
ఈ పుట్టినరోజు వేడుకకు ఎక్కువగా అతిథులు రాలేదు కాని.. ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ ల కజిన్స్ మాత్రం సందడి చేశారు. రంగు రంగులు బట్టల్లో కజిన్స్ ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక ఈ పార్టీలో అందరి డ్రస్ స్టైల్ తో పాటు.. నిక్, ప్రియాంక, బర్త్ డే గర్ల్ బట్టలు చూస్తుంటే.. ఒక థీమ్ ప్రకారం వీరు ఇలా సెట్ చేసినట్టు ఉన్నారు. ఈ విషయంలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు ప్రియాంక గారాల పట్టికి.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
ఇక ఈ పార్టీలో అందరి డ్రస్ స్టైల్ తో పాటు.. నిక్, ప్రియాంక, బర్త్ డే గర్ల్ బట్టలు చూస్తుంటే.. ఒక థీమ్ ప్రకారం వీరు ఇలా సెట్ చేసినట్టు ఉన్నారు. ఈ విషయంలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు ప్రియాంక గారాల పట్టికి.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
ఇక బర్త్ డే పార్టీతో పాటువారికి ఉన్న దైవ భక్తిని కూడా వారు చాటి చెప్పారు. ఫారెన్ లో ఉన్న ఓ హిందూ దేవాలయంలో... తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు వీరు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.