- Home
- Entertainment
- కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి
గ్లోబల్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా.. ఆమె భర్త పాప్ సింగర్ నిక్ జోనస్ జనవరి 11 రాత్రి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై అందరి మనసులను గెలుచుకున్నారు.

గోల్డెన్ గ్లోబ్స్‌కు ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
హాలీవుడ్‌లోని అతిపెద్ద అవార్డులలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్‌కు ప్రియాంక చోప్రా ప్రజెంటర్‌గా హాజరయ్యారు. ఈ సమయంలో ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఆమెతో ఉన్నారు. ఇద్దరు కలిసి హాలీవుడ్ ఈవెంట్ లో సందడి చేశార.
రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన జంట..
43 ఏళ్ల ప్రియాంక, 33 ఏళ్ల నిక్ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని రెడ్ కార్పెట్‌పైకి రాగానే అందరి చూపు వారివైపు మళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా హాజరైన స్టార్స్ వారివైపే చూస్తూ ఉండిపోయారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చి తమ స్టైల్‌తో అందరి మనసులను గెలుచుకున్నారు.
బెవర్లీ హిల్స్‌లో గ్రాండ్ గా జరిగిన వేడుకలు
బెవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా ఆఫ్-షోల్డర్ బ్లూ గౌన్ ధరించింది, అందులో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె భర్త నిక్ జోనస్ సాంప్రదాయ బ్లాక్ టక్సేడో ధరించి హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
భారతీయ సంప్రదాయం ప్రకారం
ప్రియాంక మీడియాకు పోజులిస్తూ భారతీయ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి అందరికీ నమస్కరించింది. ఆ తర్వాత గాలిలో చేతులు ఊపుతూ అందరికీ అభివాదం చేసింది. ఈ సమయంలో నిక్‌తో ఆమె ప్రేమ క్షణాలు కూడా కెమెరాలో బంధించబడ్డాయి.
అభిమానుల హృదయాలను గెలుచుకున్న జంట
ఒకసారి నిక్ జోనస్ ప్రియాంక చోప్రా జుట్టును సరిచేస్తే, మరోసారి ప్రియాంక అతని బోను సరిచేస్తూ కనిపించింది. ప్రియాంక, నిక్ లు ఈ చిలిపి పనులతోో అక్కడున్న వారినే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ప్రియాంక - నిక్ మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఆమె కంటే 10 ఏళ్లు చిన్నవాడు. కానీ ఈ వయసు తేడా వారి బంధానికి ఎప్పుడూ అడ్డురాలేదు. ఇద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమిస్తారు, ఈ చిత్రాలు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
వారణాసి బిజీలో ప్రియాంక చోప్రా..
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మే 2018లో డేటింగ్ ప్రారంభించారు. జూలై 2018లో ప్రియాంక పుట్టినరోజున నిక్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆగస్టు 2018లో వారి నిశ్చితార్థం, డిసెంబర్ 2018లో వివాహం జరిగింది. వీరికి మాలతి మేరీ చోప్రా జోనస్ అనే కుమార్తె ఉంది. ఈ జంట లాస్ ఏంజిల్స్ లో భారీ భవంతి కట్టుకుని అక్కడే నివసిస్తున్నారు. కాగా ప్రియంకా చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు జోడీగా.. రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో నటిస్తుంది.

