Thanuja : తనూజ పై మనసులో మాట బయటపెట్టిన కళ్యాణ్ పడాల , అవాక్కైన బిగ్ బాస్ 9 రన్నర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్, రన్నర్ కళ్యాణ్ పడాల, తనూజ మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్.. మరోసారి బయటపడింది. వీరిమధ్య స్నేహం కంటే బలమైన బంధం మరొకటి ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తనూజకు ఇండైరెక్టర్ గా ప్రపోజ్ చేశాడు కళ్యాన్ పడాల.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా స్పెషల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఎప్పుడైనా విన్నర్ కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి విన్నర్ తో పాటు రన్నర్ ను కూడా స్టార్ ను చేశారు. ఈసీజన్ లో విన్నర్ గా గెలిచిన కళ్యాణ్ పడాలతో పాటు.. రన్నర్ గా నిలిచిన తనూజ కు కూడా అంతే స్టార్ డమ్ వచ్చింది. దాంతో పాటు వీరి మధ్య ఉన్న బంధం కూడా అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హౌస్ లో అందరికి కనిపించిన ప్రేమ జంటగా.. రీతూ పవన్ కనిపించారు. కానీ కళ్యాణ్- తనూజల బంధం మాత్రం గ్రాండ్ ఫినాలే తరువాత నుంచి ఎక్కువగా వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ తరువాత కలిసి కనిపించని జంట..
గ్రాడ్ ఫినాలే తరువాత కళ్యాణ్ పడాల, తనూజ కలుసుకోలేదు.. విడి విడిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవరికివారు అభిమానులతో మీటింగ్స్ పెట్టుకున్నారు. విన్నింగ్ మూమెంట్ ను ఎంజాయ్ చేశారు. కొన్ని ఈవెంట్స్ కు విడిగానే వెళ్లారు. దాంతో వీరిమధ్య ఏం లేదులే అని చాలామంది అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఆడియన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తూ.. ఓ ఈవెంట్ లో ఈ జంట తళుక్కున మెరిసింది. కలిసి డ్యాన్స్ చేయడమే కాదు.. తనూజకు దాదాపు ప్రపోజ్ చేసినంత పనిచేశాడు కళ్యాణ్ పడాల. మా సంక్రాంతి వేడుకల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. తనూజకు విన్నర్ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడంతో పాటు.. సన్మానాలు, సత్కారాలు కూడా చేశారు.
తనూజకు కళ్యాణ్ పడాల ప్రపోజ్ చేశాడా..?
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తనూజపై తన ప్రేమని అలానే కొనసాగిస్తున్నాడు కళ్యాణ్. రీసెంట్ గా తనూజ-కళ్యాణ్ ఇద్దరూ మా సంక్రాంతి ఈవెంట్ లో సందడి చేశారు. దీనికి సబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ పడాల, తనూజ ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. తనూజ గురించి కళ్యాణ్ తన మనసులో మాట బయట పెట్టాడు. ''తనూజ నాకు దొరకడం నిజంగా అదృష్టం అనే అనుకుంటున్నాను.. నా లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా థాంక్స్'' అంటూ కళ్యాణ్ చెప్పగానే తనూజ సర్‌ప్రైజ్ అయింది. ఈ సీన్ చూసి.. కళ్యాణ్ తనూజకు ప్రపోజ్ చేశాడా.. వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.
బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి వేషాలు..
బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్ లో కూడా కళ్యాణ్ పడాల.. తనూజ ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండేవారు. కానీ డైరెక్ట్ గా మాత్రం ఎప్పుడు బయటపడలేదు. వారు చేసే పనులు మాత్రం కాస్త తేడాగానే ఉండేవి. ఎన్నో సార్లు హౌస్ లో వీరు ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వచ్చారు. అందుకే సీజన్ మొత్తంలో వీళ్లిద్దరి మధ్య ఒక్క గొడవ కూడా జరగలేదు. ఇద్దరు చాలా తెలివిగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిని బురిడీ కొట్టించిన సందర్భాలు ఉన్నాయి. అలానే తనూజ కూడా కళ్యాణ్‌ని చాలా స్పెషల్‌గానే ట్రీట్ చేసేది. బిగ్‌బాస్ అయిపోయిన తర్వాత అందరిలాగానే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని ఆడియన్స్ అనుకున్నారు.
తనూజ - కళ్యాణ్ అభిమానుల మధ్య వార్..
తనూజ విన్నర్ అవ్వలేదని.. ఆమె అభిమానులు గగ్గోలు పెట్టారు.. సోషల్ మీడియాలో బిగ్ బాస్ ను గట్టిగా విమర్శించారు. పనిలో పనిగా.. కళ్యాణ్ పడాలపై కూడా విరుచుకుపడ్డారు. తనూజ ఫాలోవర్స్ కు.. అదే రేంజ్ లో కళ్యాణ్ అభిమానులు కూడా సమాధానం చెప్పారు. అభిమానులు ఇలా కొట్టుకు చస్తుంటే.. కళ్యాణ్, తనూజ మాత్రం మేము ఒకరికోసం ఒకరం అన్నట్టుగా మాట్లాడారు. తనూజ లేకుండా నేను లేను.. అని కళ్యాణ్ ఓ సందర్భంలో అనగా.. పాపం కళ్యాణ్ ను తిట్టకండీ అని ట్రోలర్స్ కు తనూజ రిక్వెస్ట్ చేసింది. వీరిద్దరు క్లారిటీ ఇవ్వకుండా, ఫ్రెడ్షిప్ అంటూ.. అందరిని కన్ఫ్యూజ్ చేసేశారు.
క్లారిటీ ఇచ్చిన తనూజ..
బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత ఒకసారి తనూజ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు , నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. అయితే, మరోసారి ఒక నెటిజన్ తనూజను కళ్యాణ్‌తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన తనూజ, “మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాను. కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. హౌస్‌లో అదే ఉంది. ఇకముందు కూడా అదే ఉంటుంది. అంతకుమించి ఏమీలేదు” అని స్పష్టంగా చెప్పింది. కానీ తాజాగా జరిగిన ఈ ఈవెంట్ లో కళ్యాణ్ కామెంట్స్ మాత్రం మరోసారి వీరి బంధంపై అనుమానం కలిగేలా చేస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

