- Home
- Entertainment
- మోకాళ్లపైకున్న గౌన్‌లో ప్రియమణి విరహా పోజులు.. కిల్లింగ్ లుక్.. కాపీ క్యాట్స్ పై షాకింగ్ కామెంట్
మోకాళ్లపైకున్న గౌన్‌లో ప్రియమణి విరహా పోజులు.. కిల్లింగ్ లుక్.. కాపీ క్యాట్స్ పై షాకింగ్ కామెంట్
ప్రియమణి ఇప్పుడు హోమ్లీ బ్యూటీగా రాణిస్తున్న క్రమంలో ఆమెలోని హాట్ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది `ఢీ` షో. ప్రతి వారం ఈ షో కోసం ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల మైండ్ బ్లాంక్ చేస్తుంది. ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది.

ప్రియమణి లేటెస్ట్ గా `ఢీ` షో కోసం ఫోటో షూట్ చేసింది. ఇంద్ర ధనస్సుని పోలిన కలర్‌ఫుల్ డ్రెస్‌లో హోయలు పోయింది. కవ్వించే పోజులతో కనువిందు చేస్తుంది. విరహాలు పోతూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. మోకాళ్లపైకున్న పొట్టి గౌనులో మెస్మరైజ్ చేస్తుంది ప్రియమణి. ప్రస్తుతం ఆయా ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
అయితే ఈ సందర్భంగా ప్రియమణి చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. కాపీ క్యాట్‌ని ఉద్దేశించి ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. కాపీ క్యాట్స్ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని కోరింది. గేమ్ ఛేంజర్ కావాలని తెలిపింది.
ప్రియమణి `ఢీ` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఆమె గత కొన్ని సీజన్లుగా జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. షోకి ప్లస్ అవుతుంది. ఇందులో హైపర్ ఆదితో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కనువిందు చేస్తుంది.
ప్రస్తుతం ప్రియమణి ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్, ఇంకోవైపు వెబ్‌సిరీస్‌లు, వెబ్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. కెరీర్ పరంగా ఆమె మరో అనేక యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది.
ప్రియమణి కెరీర్ పరంగా ఇప్పుడు పీక్‌లో ఉంది. మారుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా తనని తాను మల్చుకుంటూ దూసుకుపోతుంది. అన్ని మాధ్యమాలను వాడుకుంటోంది. తనని మౌల్డ్ చేసుకుంటుంది.
ఇటీవల ఆమె `నారప్ప` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. అలాగే `భామకలాపం` అనే ఓటీటీ ఫిల్మ్ లోనూ మెరిసింది. తెలుగులో చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. 2013లో `చండీ` చిత్రంలో మెయిన్ లీడ్‌గా చేసింది. ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగుకి దూరమైంది.
మళ్లీ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె `విరాటపర్వం` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది.ఇందులో కామ్రేడ్ భరతక్క పాత్రలో కనువిందు చేయబోతుంది. ఈ సినిమా జులై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. అజయ్ దేవగన్‌తో `మైదాన్` చిత్రంలో నటిస్తుండగా, త్వరలో అట్లీ- షారూఖ్ చిత్రంలో ఎంపికైంది. మరోవైపు మూడు కన్నడ సినిమాలు, ఒక తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది.