- Home
- Entertainment
- బాడీ షేమింగ్ మాత్రమే కాదు, పెళ్లిపై కూడా విమర్శలు .. ట్రోల్స్ పై ప్రియమణి హాట్ కామెంట్..
బాడీ షేమింగ్ మాత్రమే కాదు, పెళ్లిపై కూడా విమర్శలు .. ట్రోల్స్ పై ప్రియమణి హాట్ కామెంట్..
హీరోయిన్ ప్రియమణి.. ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యారు. తాను ఏవిధమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారో వెల్లడించారు. తాజాగా ఆమె ట్రోలర్స్ పై హాట్ కామెంట్ చేశారు.

Priyamani
మొన్నటి వరకు `ఢీ` షోతో ఆకట్టుకున్న ప్రియమణి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ అయ్యింది. ఇటీవల `కస్టడీ`లో సీఎంగా మెరిసింది ప్రియమణి. తాజాగా ట్రోలర్స్ పై మండిపడింది. తన మ్యారేజ్ టైమ్‌లో వచ్చిన విమర్శలపై ఆమె ఓపెన్ అయ్యింది. చాలా సార్లు తాను విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ పెళ్లి సమయంలో కూడా వదల్లేదని వాపోయింది ప్రియమణి.
ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ని పెద్దగా పట్టించుకోనని చెప్పింది. బాడీ షేమింగ్, శరీర రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయన్నారు. అయితే ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు చెప్పింది ప్రియమణి.
`ముస్తఫాతో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నప్పుడు `నువ్వు ఎందుకు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావని అభ్యంతరకరంగా దూషించారు. హేళన చేశారు. కామెంట్ చేసేవాళ్లందరికి నేను చెప్పేది ఒక్కటే, ఇది నా జీవితం, ఎవరితో జీవితాన్ని కొనసాగించాలనేది పూర్తిగా నా ఇష్టం` అని చెప్పింది ప్రియమణి. ఈ సందర్భంగా తాను ట్రోల్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని, వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని, అందుకే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని తెలిపింది ప్రియమణి.
ప్రియమణి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. 2003 లో `ఎవరే అతగాడు` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి `పెళ్లైన కొత్తలో` చిత్రంతో పాపులర్ అయ్యింది ప్రియమణి. ఆ తర్వాత `గోలీమార్`, `యమదొంగ`, `నవవసంతం`, `హరే రామ్`, `కింగ్`, `ద్రోణ`, `మిత్రుడు`, `ప్రవరాఖ్యుడు`, `శంభో శివ శంభో`, `సాధ్యం`, `రక్త చరిత్ర`, `రగడ`, `రాజ్`, `చండీ` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
Priyamani
ఇటీవల కెరీర్ పరంగా టర్న్ తీసుకుని కీలక పాత్రలతో మెప్పిస్తుంది. ఆ మధ్య `విరాటపర్వం`లో నక్సలైట్‌గా మెరిసింది. `కస్టడీ`లో సీఎంగా నటించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, కన్నడలో ఓ చిత్రం హిందీలో `మైదాన్`, `జవాన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఓటీటీలోనూ బిజీ అవుతుంది ప్రియమణి. గతేడాది `ఢీ 14`కి ఆమె జడ్జ్ గా వ్యవహరించారు. వరుసగా మూడు సీజన్లకి ఆమె జడ్జ్ గా కొనసాగారు.