- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కోడళ్ళు.. అత్త బండారం బయటపెట్టిన దివ్య!
Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కోడళ్ళు.. అత్త బండారం బయటపెట్టిన దివ్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. కోడలి సంసారంలో నిప్పులు పోయాలనుకుంటున్న అత్తకి సరైన గుణపాఠం చెబుతున్న ఒక కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను పెట్టిన భోజనం తినకపోతే నీ తల్లిదండ్రులని జైలుకు పంపించిన వాడివి అవుతావు అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది లాస్య. కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు నందు. లాస్యకి చీవాట్లు పెడుతుంది అనసూయ. నందు ఈ ఇంట్లో భోజనం చేస్తే అది నా చేత్తోనే చేయాలి అని చెప్పి పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లాస్య.
అనవసరంగా సమస్యలను పెద్దది చేసుకోవద్దు అత్తయ్య మనమే నష్టపోవాల్సి వస్తుంది అంటుంది తులసి. మరోవైపు విక్రమ్ వాళ్ళ తాతయ్య దివ్య రాజలక్ష్మి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన ప్రియ అత్తగారి ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి నిన్ను పుట్టింటికి వెళ్ళకుండా చేసి నిన్ను ఒంటరిని చేయాలని చూస్తుంది అంటుంది. ఆవిడ అలా చేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు.
దివ్య నీరసంగా మాత్రమే ఉంది నిరాశలో లేదు ఆవిడ చేసే ప్రతి ఎత్తుని తిప్పి కొడతాను అంటుంది దివ్య. మరోవైపు భోజనం చేయకుండా కూర్చున్న అత్తమామలకి జ్యూస్ తీసుకువస్తుంది తులసి. ఇప్పుడు మాకు కావలసింది ఆకలి తీర్చడం కాదు మాకున్న కష్టాలు తీర్చడం. నందుని అలా చూస్తూ ఉండలేకపోతున్నాము. వాడు నీకు ఎప్పుడైతే విడాకులు ఇచ్చాడో అప్పటి నుంచే వాడి పతనం ప్రారంభమైంది అంటాడు పరంధామయ్య.
తను అన్ని తప్పులు చేస్తుంటే నువ్వు కనీసం లాస్య చేసింది తప్పని ఒక ముక్క కూడా అనలేదు ఎందుకు అంటూ తులసిని నిలదీస్తుంది అనసూయ. నేనేంటో తెలిసి కూడా నన్ను ఆవేశంలో ఇంత మాట అన్నారు అలాంటిది లాస్య ఆవేశంలో ఉంది తనని కెలకకుండా ఉండటమే మనకి మంచిది అంటుంది తులసి. వాడి జీవితం అంతే ఇంకా బాగుపడదు అంటూ బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు పరందమయ్య దంపతులు.
మరోవైపు పుట్టింటికి బయలుదేరిన దివ్య అత్తగారి పర్మిషన్ తీసుకోలేదు ఏమంటారో అని భర్తతో అంటుంది. మా అమ్మని రాక్షసి కాదు తనకి కూడా పుట్టింటి విలువ తెలుసు అయినా నిన్ను పుట్టింటికి పంపించే బాధ్యత నాది అని చెప్పి తల్లి దగ్గరికి తీసుకు వస్తాడు విక్రమ్. దివ్య తన పుట్టింటికి వెళ్తుంది అని తల్లితో చెప్తాడు విక్రమ్. అదేంటి బాబు నువ్వు తోడుగా వెళ్ళవా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి.
లేదమ్మా నాకు పొలంలో కొంచెం పని ఉంది వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తాను అంటాడు విక్రమ్. అప్పుడు రాజ్యలక్ష్మి , ప్రియ ని పిలిచి ఆ గదిలో స్వీట్స్ బట్టలు ఉంటాయి తీసుకొని రా అని చెప్తుంది. రాజ్యలక్ష్మి చెప్పినట్లే చేస్తుంది ప్రియ. వీటిని తీసుకొని నువ్వు కూడా దివ్యకి తోడుగా వెళ్ళు అని చెప్తుంది రాజ్యలక్ష్మి. అత్త ప్రవర్తనికి కోడళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. చూసావా మా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మనసు నిండిపోవాల్సిందే అంటాడు విక్రమ్. ఇంతలో నందుకు ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఇక్కడికి రావద్దు వీలు చూసుకుని నేనే వస్తాను అని చెప్తాడు.
ఆ మాటలకి బాధపడుతుంది దివ్య ఇవి నీ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు ఒకసారి నీ ఎదురుగా ఉన్న అమ్మకి ఫోన్ ఇవ్వు అంటుంది. నేనేమి చిన్న పిల్లాడిని కాదు నన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు.. అలాగే నా ఎదురుగా మీ అమ్మ లేదు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నందు. అప్పుడు రాజ్యలక్ష్మి ప్రవర్తన కి కారణం తెలుసుకుంటుంది దివ్య. నందు చెప్పిన విషయాన్ని భర్తకి చెప్తుంది దివ్య. సరే అయితే నేను పొలానికి వెళ్లి వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్.
ఆ స్వీట్స్ అత్తయ్య గారికి ఇచ్చేయ్ ప్రియా తిని పండగ చేసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది దివ్య. మరోవైపు నా చేత బలవంతంగా అలా ఎందుకు చెప్పించావు దివ్య ఎంత బాధ పడిందో ఏంటో అంటూ బాధపడతాడు నందు. అలా చేయటానికి కారణం ఉంది మీరు ఆవేశం తెచ్చుకొని గొడవకి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి అని చెప్పి భర్త దగ్గర మాట తీసుకుని అప్పుడు నా ఈ ప్రవర్తనకి కారణం రాజ్యలక్ష్మి అని చెప్తుంది తులసి.
తరువాయి భాగంలో మామగారి గదిలో అనుమానాస్పదంగా ఉన్న సిస్టర్ ని ఆమె చేతిలో ఉన్న టాబ్లెట్స్ ని అనుమానంగా చూస్తుంది దివ్య. నువ్వు ఎవరు ఆ టాబ్లెట్స్ ఎందుకు దాస్తున్నావు అంటూ ఆమె దగ్గర బలవంతంగా టాబ్లెట్స్ లాక్కొని చూసి షాక్ అవుతుంది దివ్య. ఆ టాబ్లెట్స్ ని కోపంతో విసిరేస్తుంది. అది విక్రమ్ చూసి దివ్యని నిలదీస్తాడు. అది టాబ్లెట్స్ కాదు స్లో పాయిజన్ అంటుంది దివ్య. వీటితో ఎవరికి ఏం అవసరం ఉంది అంటాడు విక్రమ్. ఆ మాట మీరు మీ అమ్మ గారిని అడగండి అంటుంది దివ్య.