MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Khalifa OTT: తండ్రిని జైలుపాలు చేసిన వాళ్లపై వారణాసి విలన్ రివేంజ్..ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Khalifa OTT: తండ్రిని జైలుపాలు చేసిన వాళ్లపై వారణాసి విలన్ రివేంజ్..ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Prithviraj Sukumaran Khalifa OTT: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఖలీఫా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చింది. తెలుగు వెర్షన్ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలో ఖలీఫా
Image Credit : Asianet News

ఓటీటీలో ఖలీఫా

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఖలీఫా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మేకర్స్ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు డిజిటల్ విడుదలపై దృష్టి పెట్టారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు పలు ప్రాంతాల్లోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కథ ఏంటంటే
Image Credit : X

కథ ఏంటంటే

ఖలీఫా కథలో అమీర్ అలీ అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తాడు. తండ్రి యూసుఫ్ అలీ సూచనలతో అమీర్ ఎదుగుతూ, కుటుంబ వ్యాపారంలో భాగమవుతాడు. వ్యాపారంలో భాగంగా అమీర్ తండ్రికి బెదిరింపులు ఎదురవుతాయి. బెదిరింపులకు అమీర్ తండ్రి లొంగరు. దీనితో అతడిని గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయిస్తారు. జైలు పాలైన తండ్రిని విడిపించేందుకు అమీర్ చాలా కష్టపడతాడు. తన తండ్రిని ఇబ్బంది పెట్టిన వాళ్లపై అదే మార్గంలో రివేంజ్ తీర్చుకోవాలని అతడు కూడా గోల్డ్ స్మగ్లింగ్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన తాత గురించి అమీర్ కి ఊహించని విషయం తెలుస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది ఈ చిత్ర కథ.

35
తెలుగులో ఎక్కడ చూడొచ్చు
Image Credit : Facebook

తెలుగులో ఎక్కడ చూడొచ్చు

ఖలీఫా ప్రస్తుతం ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, మనోరమామ్యాక్స్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు విదేశాల్లో స్టార్‌జ్‌ప్లే, సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను ఆహా లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

45
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం
Image Credit : stockPhoto

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం

ఖలీఫా మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో వచ్చిన వసూళ్లు నిర్మాతలకు అనుకూలంగా లేవు. బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందనేది చూడాల్సి ఉంది.

55
ప్రముఖ నటీనటుల సందడి
Image Credit : instagram

ప్రముఖ నటీనటుల సందడి

ఖలీఫాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మాళవిక శర్మ, షమ్మీ తిలకన్, ఇంద్రన్స్, సురేశ్ ఒబెరాయ్, రెంజి పనికర్, మోహిని కీలక పాత్రల్లో నటించారు. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, టొవినో థామస్ కూడా ప్రత్యేక పాత్రల్లో కొద్దిసేపు కనిపిస్తారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఆరు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Voting: ఐదో వారం ఓటింగ్‌.. టాప్‌లో రోహిత్‌, కానీ డేంజర్‌లో ముగ్గురు, ఇద్దరు ఔట్‌
Recommended image2
Jason Sanjay: డైరెక్టర్‌గా ఫ్లాప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
Recommended image3
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Recommended image2
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved