వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై పృథ్వీరాజ్ వివక్ష.. వెళ్తూ వెళ్తూ తన నిజ స్వరూపం బయటపెట్టిన కన్నడ నటుడు
బిగ్ బాస్ తెలుగు 8 ఆదివారం ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ తన రియాలిటీ బయటపెట్టాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌పై వివక్ష చూపించాడు.
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వ వారం రెండో ఎలిమినేషన్ ఫైనల్ అయ్యింది. ఊహించినట్టుగానే, ప్రచారం జరుగుతున్నట్టుగానే పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున తెలిపారు.
అయితే ఆయన విష్ణుప్రియాతో కలిసి ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొనడం గమనార్హం. ఈ ఇద్దరు హౌజ్‌లో ప్రేమ పక్షులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరే ఎలిమినేషన్‌లో చివరి వరకు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా, పృథ్వీరాజ్ ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడుతున్నట్టు నాగ్ వెల్లడించారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని నాగార్జున చెబుతూ వచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. డైరెక్ట్ గా తేజాని ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు నాగ్. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో రెండో ఎలిమినేషన్ పృథ్వీరాజ్ అయ్యారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వివక్ష చూపించాడు పృథ్వీరాజ్.
ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చాడు పృథ్వీరాజ్. తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యారు. అనంతరం నాగ్.. హౌజ్‌లో ఎవరు సూపర్ హిట్, ఎవరు సూపర్ ఫ్లాప్ అని చెప్పాలన్నారు. అందులో నిఖిల్, విష్ణు ప్రియా, నబీల్‌లకు సూపర్ హిట్ ట్యాగ్ ఇచ్చాడు. రోహిణి, అవినాష్‌లకు సూపర్ ఫ్లాప్ ట్యాగ్ ఇచ్చాడు. వీరిద్దరు నామినేషన్‌లోకి రావాలని, ఆడియెన్స్ జడ్జ్ మెంట్ తీసుకోవాలన్నారు.
అవినాష్ ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉందని, కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడని, ఇప్పుడు ఫైనల్‌కి వెళ్లాడని, ఇంకా బాగా ఆడాలని తెలిపారు పృథ్వీరాజ్. అనంతరం ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను ఎవరికి ఓట్ వేస్తానో తెలిపారు. నిఖిల్, విష్ణు ప్రియా, నబీల్, ప్రేరణలకు తన ఓటు అని ప్రకటించాడు.
గౌతమ్, రోహిణి, అవినాష్ ల ప్రస్తావన తీసుకురాలేదు. బహిరంగంగానే ఈ నలుగురుకి ఓటు వేస్తానని, నాలుగు ఫోన్లు తీసుకుని ఓటు వేస్తానని వెల్లడించాడు. అయితే వీరంతా ప్రారంభంలో వచ్చిన కంటెస్టెంట్లు. గౌతమ్, అవినాష్, రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. పృథ్వీ.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో తన వివక్షని చూపించాడు. వారికి ఓటు వేయనని ఓపెన్‌గానే ప్రకటించాడు.
ఇక ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్‌మేట్స్ తో గేమ్స్ ఆడించారు. సండే ఫండే కావడంతో ఫన్నీ టాస్క్ లతో అలరించారు. మొదటి సాంగ్స్ నేమ్స్ చూపించి గెస్ట్ చేయాలనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణు ప్రియా టీమ్ ఎక్కువగా గెస్ చేసి విన్నర్‌గా నిలిచింది. అనంతరం ఎవరికి వాళ్లు ఆడే గేమ్ పెట్టాడు.
ఇది కూడా ఆద్యంతం ఫన్నీగా సాగింది. మరోవైపు హౌజ్‌లో మార్చుకోవాల్సిన లక్షణలకు సంబంధించి ఎక్కువగా అవినాష్‌కి ఇచ్చాడు. ఇంకోవైపు సినిమా హీరోల పోస్టర్లకి కంటెస్టెంట్ల ఫేసులు యాడ్ చేశారు. ఇది మరింత ఫన్నీగా అనిపించింది.
13 వారాలు బిగ్ బాస్ షోస్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియా, అవినాస్, రోహిణి ఉన్నారు. వీరిలో 14 వారం ఒకరుగానీ, ఇద్దరుగానీ ఎలిమినేట్ అవుతారు. ఫైనల్‌లోకి 5 మంది కంటెస్టెంట్లు వెళ్తారు. ఈ సారి ఆరుగురు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఆదివారం ఎపిసోడ్‌లో ఇంకా ట్విస్ట్ లు, టర్న్ లు అయిపోలేదు, ఇంకా ఉన్నాయి అని చెప్పడం విశేషం. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే అవినాష్ ఫైనల్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఫైనల్‌లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా అవినాష్ నిలిచారు. ఎన్నో సెంటిమెంట్లని బ్రేక్ చేశారు.
also read: కృష్ణుడిగా నన్ను జనం చూస్తారా? అనుమానంతో ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా? రాజమౌళిని మించిన స్ట్రాటజీ?