- Home
- Entertainment
- Intinti Gruhalashmi: నందును అడ్డంగా బుక్ చేసిన లాస్య కొడుకు.. మాల్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రేమ్, అభి!
Intinti Gruhalashmi: నందును అడ్డంగా బుక్ చేసిన లాస్య కొడుకు.. మాల్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రేమ్, అభి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్(pream),శృతి ఇద్దరూ కలిసి మాల్ లో ఎక్కడికి వెళ్లాలి అన్న విషయంపై పందెం వేయగా ఆ పందెంలో ప్రేమ్ గెలుస్తాడు. అప్పుడు శృతి(shruthi) అలగడం తో ప్రేమతో బుజ్జగిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇక మరొకవైపు తులసి కుటుంబం కూడా షాపింగ్ మాల్ కి వెళ్లారు. అప్పుడు అనసూయ ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది ఏదైనా బట్టల షాపింగ్ షాపింగ్ కి తీసుకెళ్ళమని తులసిని అడుగుతుంది.
వెంటనే దివ్య(divya) అలా కాదు ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్లను గేమ్స్ ఆడే దగ్గరికి తీసుకుని వెళుతుంది. అలా తులసి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఇంతలోనే అక్కడికి నందు లక్కీ ని తీసుకుని వస్తాడు. అప్పుడు అక్కడ కాశ్మీర్ ట్రిపుల్ తన పేరును కూడా రాస్తాడు. అప్పుడు లక్కీ (lucky)మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన విషయం అమ్మకు చెప్పవద్దు లేదంటే ఇక్కడ కూడా కండిషన్ లు పెడుతుంది అని అంటాడు.
అప్పుడు ఆ విషయం లాస్య( lasya) చెప్పకూడదు అని మనసులో అనుకుంటాడు. ఇంతలోనే లాస్య ఫోన్ చేయడంతో లక్కీ నా మొబైల్ తీసుకుని అంకుల్ ఇంట్లో బోర్ కొడుతుంది అంటే మాల్ కు తీసుకొని వచ్చాడు అని చెప్పి నందుని అడ్డంగా బుక్ చేస్తాడు. అప్పుడు లాస్య ( lasya)లక్కీ నీ మాల్ కి తీసుకుని వెళ్లారు అంటే లక్కీ మీద నీకు ప్రేమ ఉంది కదా అని అని చెప్పి లాస్య కూడా అక్కడికి వస్తాను అని అంటుంది.
అనుకోకుండా అదే మాల్లోకి అంకిత(ankitha) అభి లు కూడా వస్తారు. అప్పుడు అంతా షాపింగ్ చేస్తూ ఉండగా అభి మాత్రం చిరాకు పడుతూ ఉంటాడు. మరొక వైపు ప్రేమ్, శృతి(shruthi) లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అభి నిరసనగా కొట్టడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్, శృతి లు రావడంతో సంతోషంగా ఫీల్ అవుతారు.
అప్పుడు అంకిత పొరపాటున డబ్బు విషయం గురించి మాట్లాడగా శృతి (shruthi )వద్దు అంటూ సైగలు చేయడంతో వెంటనే టాపిక్ మారుస్తుంది. ఆ తర్వాత నందు, లాస్య లు తులసీ(tulasi) వాళ్ళను చూస్తారు. అప్పుడు లక్కీ చూస్తే ప్రమాదం అవుతుంది అని పిలుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలోనే దివ్య పిలుస్తుంది.