- Home
- Entertainment
- Prema Entha Madhuram: మోసంతో ఆర్య, నీరజ్ లను బయటికి రప్పించిన ప్రీతి.. రాగసుధ మాటలకి షాకైన కుటుంబ సభ్యులు!
Prema Entha Madhuram: మోసంతో ఆర్య, నీరజ్ లను బయటికి రప్పించిన ప్రీతి.. రాగసుధ మాటలకి షాకైన కుటుంబ సభ్యులు!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అందరి హృదయాలని దోచుకుంది. తమ్ముడి భవిష్యత్తు కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాగసుధ వచ్చేస్తుంది బ్రో ఇన్ లా ని సైడ్ చేయాలి అనుకుంటూ ప్రీతికి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తుంది మాన్సీ. ప్రీతి, నీరజ్ కి ఫోన్ చేసి గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ కి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్ వచ్చింది కానీ అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసి రేపే కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది.
సరే అంటూ ప్రీతి కి ఒక అడ్రస్ చెప్పి నువ్వు అక్కడికి వచ్చి నేను ఆనంద్ ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. విషయమంతా ఆర్య కి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు అన్నదమ్ములు ఇద్దరు. ఆర్య అటు వెళ్లిన వెంటనే రాగసుధ ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు ప్రీతి దగ్గరికి వచ్చిన ఆర్య ఏమైంది అని అడుగుతాడు.
ప్రాజెక్టుకి సంబంధించిన డాక్యుమెంటు మిస్సైంది అంటుంది ప్రీతి. సేవ్ చేయడం మర్చిపోయాను అంజలి మేడం కి తెలిస్తే కోప్పడతారు అందుకే మీ హెల్ప్ అడిగాను అంటుంది ప్రీతి. సరే అంటూ లాప్టాప్ తీసుకొని పని స్టార్ట్ చేస్తాడు ఆర్య.మరోవైపు కావాలని గొడవపడతారు మాన్సీ, రాగసుధ. ఆ గొడవలో భాగంగా మాన్సీ మీద నూనె పోస్తుంది రాగసుధ .దాంతో మరింత గొడవ పెంచుకుంటుంది మాన్సీ. అమ్మవారి సేవకని పిలిపించి అవమానిస్తే మీకే అరిష్టం అంటుంది రాగసుధ.
ఈ మాత్రానికే అంత పెద్ద మాటలు ఎందుకు తప్పు మా అమ్మాయిదే క్షమించండి అంటుంది శారదమ్మ.ఆ క్షమాపణ ఏదో నా కాళ్లు పట్టుకొని చెప్పు అంటుంది రాగసుధ. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. అమ్మవారి సేవకురాలిని అంటున్నారు పెద్ద చిన్న తేడా తెలియదా అంటుంది అను. ఫోన్లే పాపం అని దీవించడానికి వస్తే నన్నే అవమానిస్తారా ఈ కడుపే నీకు అష్ట కష్టాలు తెచ్చిపెడుతుంది, పుట్టే బిడ్డ కూడా నీకు దక్కకుండా పోతాడు అంటూ శపిస్తుంది రాదుసుధ. నీకు దండం పెడతాను అలా శపించకు అంటూ వేడుకుంటుంది పద్దు. అంతలోనే అష్టమి ఘడియలు రావటంతో రాజనందిని ఆవహించి రాగసుధ మెడ పట్టుకుంటుంది.
ఆమెని ఒక్క తోపు తోసి ఏమన్నావు అంటూ ఆమె మీద పడబోతుంది. తనని పద్దు, సుబ్బు ఆపుతారు. అయినా ఆవేశం చల్లారని అను ఆమె మీదకి కొట్టడానికి బిందెతో సహా వస్తుంది. నాకు ఈ ఆవేశమే కావాలి ఈ ఆవేశమే నీ కడుపులో బిడ్డని చంపేస్తుంది అని ఆనందపడుతుంది రాఘసుధ. కడుపుతో ఉన్నవాళ్లు ఇలా ఆవేశ పడకూడదు అంటూ అనుని ఓదార్చుతుంది శారదమ్మ అవును కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అంటుంది మాన్సీ. ఆవేశంలో ఉన్న అను మాన్సీ పీక పట్టుకుని పైకి ఎత్తేస్తుంది. నా బిడ్డకే ప్రమాదం అంటావా అంటూ మాన్సీ ని పరిగెత్తించి కొడుతుంది అను.
అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య నీరజ్ జరిగింది తెలుసుకొని లోపలికి వచ్చి అమ్మవారి బొట్టు పెట్టి అనుని శాంతింప చేస్తారు. అక్కడినుంచి ఏడుస్తూ కంగారుగా పరిగెత్తి వెళ్ళిపోతుంది రాగసుధ.మెలకువ వచ్చిన అను సర్ నాకు ఏమైంది నేను ఎందుకిలా ఉన్నాను అని అడుగుతుంది. ఏమి కాలేదు అని చెప్తాడు ఆర్య. లేదు నేను ఏదో చేశాను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, నాకేదో అవుతుంది. నా బిడ్డకి ఏమి కాలేదు కదా అని కంగారుగా అంటుంది అను. ఏమి జరగలేదు అష్టమి ఘడియలు రావటంతో ఎప్పటిలాగే డిస్టర్బ్ అయ్యావు అంతే నీకేమీ కాలేదు మేమందరం ఇక్కడే ఉన్నాం.
భయం లేదు కాసేపు రిలాక్స్ అవ్వు అంటూ అక్కున చేర్చుకుంటాడు ఆర్య. అను కి దిష్టి తీసి హారతి ఇవ్వండి అరిష్టం పోతుంది అంటుంది శారదమ్మ. పద్దు హారతి ఇచ్చి బొట్టుపెడుతుంది. మాకు ఏంటి ఈ టార్చర్ ఏమైనా జరిగితే ఏంటి గతి అంటుంది మాన్సీ. ఈ సిచువేషన్ గురించి మీకు తెలిసిందే కదా అర్థం చేసుకో అంటాడు నీరజ్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.