Preetham Jukalker: మరోసారి వార్తల్లో ప్రీతమ్, మెగా డాటర్ శ్రీజపై కామెంట్స్.. నెటిజన్ల మధ్య హాట్ డిస్కషన్
ఇటీవల స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా రౌండ్లు కొట్టింది. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రీతమ్ స్టైలిస్ట్ గా పనిచేశాడు. చైతు, సమంత విడాకులతో విడిపోయాక ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా రౌండ్లు కొట్టింది. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రీతమ్ స్టైలిస్ట్ గా పనిచేశాడు. చైతు, సమంత విడాకులతో విడిపోయాక ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది. చై, సమంత మధ్య విభేదాలకు కారణం ప్రీతమ్ అంటూ సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
దీనితో సమంత కూడా నిందలు పడాల్సి వచ్చింది. ప్రీతమ్ ని టార్గెట్ చేస్తూ చాలా రోజులు ట్రోలింగ్ కొనసాగింది. ప్రీతమ్.. సమంతతో చనువుగా ఉండడం వల్లే అసలు సమస్య వచ్చిందంటూ ఆరోపణలు వినిపించాయి. దీనిపై స్వయంగా సమంత కూడా స్పందించింది. విడాకులే ఎక్కువగా మనసుకి బాధ కలిగిస్తుంటే ఇలాంటి నిందలు ఏంటని వాపోయింది.
తనపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ప్రీతమ్ కూడా స్పందించాల్సి వచ్చింది. సమంత తనకు అక్క లాంటిది అని.. తమ మధ్య చెడు రిలేషన్ లేదని ప్రీతమ్ బదులిచ్చాడు. నాగ చైతన్య సైలెంట్ గా ఉండకుండా ఈ ఆరోపణలని ఖండించాలని, తన అభిమానులకు నచ్చజెప్పుకోవాలని ప్రీతమ్ ఓ ఇంటర్వ్యూలో కోరాడు. ఇదిలా ఉండగా విడాకులు తర్వాత సమంత, చైతు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
మరోసారి ప్రీతమ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ప్రీతమ్ మెగా డాటర్ శ్రీజ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన పుట్టినరోజున విషెష్ తెలియజేసినఅందరికి ధన్
శ్రీజ పోస్ట్ పై ప్రీతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. శ్రీజ ఫోటోకి ప్రీతమ్ 'సుందర్ లడకి' (అందమైన అమ్మాయి) అని కామెంట్ పెట్టాడు. ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనితో ప్రీతమ్ కామెంట్స్ నెటిజన్ల మధ్య హాట్ డిస్కషన్స్ కి కారణం అయ్యాయి.
ప్రీతమ్ కేవలం సమంతకు మాత్రమే కాదు శ్రీజ, బన్నీ సతీమణి స్నేహ లాంటి సెలెబ్రెటీలకు స్టైలిస్ట్ గా వ్యవహారిస్తున్నారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీజకు ఇప్పటికే ఓ కుమార్తె ఉండగా.. కళ్యాణ్ దేవ్ తో మరో పాప సంతానం కలిగింది. Also Read: బాంబు లాంటి రెమ్యునరేషన్.. బాలయ్య చిత్రానికి షాకింగ్ కండిషన్స్ పెట్టిన శృతి హాసన్ ?