బాంబు లాంటి రెమ్యునరేషన్.. బాలయ్య చిత్రానికి షాకింగ్ కండిషన్స్ పెట్టిన శృతి హాసన్ ?

ప్రస్తుతం బాలయ్య జోరు మామూలుగా లేదు. బోయపాటి దర్శకత్వంలో నటించిన అఖండ చిత్రం డిసెంబర్ 2న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు రోరింగ్ రెస్పాన్స్ వస్తోంది. 

Shruti Haasan shocking conditions to NBK107

ప్రస్తుతం బాలయ్య జోరు మామూలుగా లేదు. బోయపాటి దర్శకత్వంలో నటించిన అఖండ చిత్రం డిసెంబర్ 2న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు రోరింగ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలయ్య ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ గా కూడా చేస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107వ చిత్రానికి కూడా ప్రారంభించారు. 

గోపీచంద్ మలినేని చిత్రం యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో Balakrishnaకు హీరోయిన్ తొలిసారి Shruti Haasan నటించబోతోంది. ఈ చిత్రానికి శృతి హాసన్ ఊహించని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ముందుగా ఈ చిత్రంలో నటించే ఆలోచన శృతి హాసన్ కు లేదట. కానీ గోపీచంద్ మలినేనితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బలుపు, క్రాక్ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ శృతి హాసన్ అంత సులభంగా ఈ చిత్రానికి ఓకె చెప్పలేదు. రూ.2 కోట్ల బాంబు లాంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. 

శృతి హాసన్ ని వదులుకోలేక నిర్మాతలు వెంటనే ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అతిగా ఉండే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించను అనేది శృతి హాసన్ ప్రధానమైన కండిషన్. సాంగ్స్ లో గ్లామర్ గా కనిపించడానికి, డాన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎక్కువగా టచింగ్ లు ఉండేలా హగ్గులు లాంటివి ఉండకూడదు అని దర్శకుడికి శృతి తెలిపిందట. 

Also Read: Bheemla Nayak: 'భీమ్లా నాయక్' బ్యూటీ సంయుక్త మీనన్ మతిపోగోట్టే ఫోజులు.. డబుల్ డోస్ హాట్ నెస్

అలాగే తన పాత్రని హుందాగా ఉండేలా రూపొందించాలని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కండిషన్స్ కి గోపీచంద్ అంగీకరించడమే కాదు.. ఎలాంటి సమస్య ఉండదు అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. ఈ మూవీలో బాలయ్య పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నట్లు టాక్. క్రాక్ తో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని ఈ మూవీలో బాలయ్యని ఇంకా పవర్ ఫుల్ గా చూపిస్తారనే కాన్ఫిడెన్స్ తో నందమూరి అభిమానులు ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios