- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్ ని మళ్లీ దారుణంగా అవమానించిన తులసి.. రీ-ఎంట్రీ ఇచ్చిన ప్రవల్లిక..?
Intinti Gruhalakshmi: ప్రేమ్ ని మళ్లీ దారుణంగా అవమానించిన తులసి.. రీ-ఎంట్రీ ఇచ్చిన ప్రవల్లిక..?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 26 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి ఫ్యాక్టరీని గవర్నమెంట్ వాళ్ళు క్లోజ్ చేసినందుకు లాస్య(lasya), భాగ్య ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నందు (nandu)అక్కడికి వచ్చి ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అని అడగగా అసలు విషయాన్ని చెప్పడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. బయటికి చెప్పకపోయినా మనసులో నందు బాధపడుతూ ఉంటాడు.
మరొక వైపు తులసి బాధతో ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. బయట కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు తులసి (tulasi) జరిగిన విషయం వివరించడంతో వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదే అదనుగా భావించిన నందు (nandu ) ఇంతలో అక్కడికి వచ్చి చేతగాని పనులు చేయడమే తులసి తప్పు అని కోపంతో మాట్లాడుతూ ఉంటాడు.
ఇంతలో అనసూయ ఎవర్రా నిన్ను పిలిచింది నీకు మాకు ఏం సంబంధం అని అంటుంది. మీరు నన్ను వద్దనుకున్నా మీరు నా తల్లిదండ్రులు మీ బాగోగులు చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని అంటాడు నందు. తులసి(tulasi) బాధతో కూర్చొని ఉండగా అప్పుడు లాస్య నందుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అభి(abhi) తన తల్లి చేసిన మంచి పనులు అన్నీ మర్చిపోయి తన తల్లిని నిలదీస్తాడు.
ఏదో సాధిస్తాను అని చెప్పి అందరినీ బయటకు గెంటేశావు ఇప్పుడు ఏం జరిగింది చూడు అమ్మ అని అనడంతో ఆ మాటకు తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య(lasya) తులసి లేనిపోని మాటలు అంటూ తులసిని మరింత బాధ పెడుతుంది. అప్పుడు దివ్య లాస్య పై కోప్పడుతుంది. ఒకవైపు నందు, లాస్య మరొకవైపు అభి అన్న మాటలకు తులసి(tulasi) కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రేమ్ కష్టాల్లో ఉన్న మనిషిని బెదిరించడం కాదురా చేయాల్సింది. అప్పుడు ప్రేమ్, మాట్లాడుతూ అభి పై కోప్పడతాడు.
ప్రేమ్ తులసికి సపోర్టుగా మాట్లాడుతూ అందరికీ తన మాటలతో గుణపాఠం చెబుతాడు. అప్పుడు తులసి, ప్రేమ్(pream) పై కోప్పడుతూ ఇంకొక్క క్షణం ఇక్కడ ఉన్నావ్ అంటే జీవితంలో నీ మొఖం చూడను.. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇంతలో అనసూయ దంపతులు ఈరోజుతో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు తల్లిదండ్రులు చనిపోయారు అనుకో అని అనడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అప్పుడు అనసూయ(Anasuya )మాట్లాడుతూ తులసి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు.. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మాట్లాడతారు. ఆ తరువాత అభి ని కుడా తిట్టడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లి పోతారు. ఆ తరువాత అందరు వెళ్ళి పోయాక తులసి (tulasi) బాధపడుతూ ఉంటుంది. తులసి కంపెనీలో పనిచేసే వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
నందు, (nandu)లాస్య కారులో వెళ్తూ అనసూయ దంపతులు గుర్తుచేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటారు.మరొకవైపు బాధపడుతూ వుంటుంది. తులసితో కుటుంబం మొత్తం ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో తులసి ఫ్రెండ్ ప్రవళ్ళిక(pravallika) రావడంతో తులసి ఎంతో ఆనంద పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.