Prashanth Varma : ‘హనుమాన్’ సీక్వెల్... హన్మంతుడి పాత్రలో పెద్ద హీరో... అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
‘హను-మాన్’తో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma బ్లాక్ బాస్టర్ ను అందుకున్నారు. ఇక నెక్ట్స్ HanuMan Movie సీక్వెల్ పై దృష్టి పెట్టారు. ఈ మూవీపై తాజాగా అప్డేట్ కూడా అందించారు.
యంగ్ హీరో తేజా సజ్జ Teja Sajja - యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma కాంబోలో సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని భాషల్లో మంచి ఆదరణను పొందుతోంది.
ఓవర్సీస్ లోనూ ప్రేక్షకులు హిట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘హనుమాన్’ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.200 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది.
సంక్రాంతికి పెద్ద సినిమాలకు పోటీగా దిగినా.. ‘హనుమాన్’ చిత్రమే విన్నర్ గా నిలిచింది. తెలుగు స్టేట్స్ లో పెద్దగా థియేటర్లు లభించకపోయినా ఇతర భాషల్లో తగినన్ని థియేటర్లతో విడుదలైంది. తొలిరోజు నుంచే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లోనూ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘హనుమాన్’తో ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
ఇందుకు ఇప్పటికే ఆయన ‘హనుమాన్’ సీక్వెల్ ను ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ Jai HanuMan రూపుదిద్దుకోనుంది. ఈ మూవీపై ప్రశాంత్ వర్మ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘హనుమాన్’ సక్సెస్ లో భాగంగా ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో సీక్వెల్ పై మాట్లాడారు.
‘జై హనుమాన్’లో తేజా సజ్జా హీరో కాదని స్పష్టం చేశారు. సీక్వెల్ లోనూ హనుమంతుడి పాత్రలో కనిపిస్తాడు గానీ.. ఆ సినిమాలో అసలు హీరో ఆంజనేయుడు. ఆ పాత్రలో స్టార్ హీరో నటించబోతున్నారని చెప్పారు. 2025లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
Prashanth Varma
ఈ చిత్రాల కంటే ముందు తన నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయని చెప్పారు. ఒకటి ‘అధీర’, మరొకటి ‘మహాకాళి’ అని చెప్పారు. నెక్ట్స్ ఈ రెండు సినిమాలపైనే ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక ‘హనుమాన్’ సక్సెస్ తనొక్కడిదే కాదని.. టీమ్ సహకారంతో ఈ విజయాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు.