షాకింగ్: ‘సలార్’డిజప్పాయింట్ చేసిందంటూ ప్రశాంత్ నీల్
సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. అయితే, సలార్ 2 తన కెరీర్‌లోనే బెస్ట్ వర్క్ అని, ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Prashanth Neel
హీరో ప్రభాస్ (Prabhas)- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్’ (Salaar) మంచి సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు, ప్రశాంత్ నీల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని, అందుకే ‘సలార్ 2’ (Salaar 2) ప్రాజెక్టు రద్దు అయిందని ఆ మధ్యన జోరుగా ప్రచారం సాగింది.
ఆ రూమర్స్‌పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది కూడాను. సెట్స్‌లో ప్రభాస్- ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వారు నవ్వకుండా ఉండలేరు అంటూ ఇండైరక్ట్ గా రూమర్స్‌ని ఖండించింది.
‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ (Salaar: Part 1- Ceasefire) లాస్ట్ ఇయిర్ డిసెంబరులో విడుదలై, ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో, ‘శౌర్యాంగ పర్వం’ (shouryanga parvam) పేరుతో రూపొందనున్న పార్ట్ 2పై అంచనాలు నమోదయ్యాయి. ఈ సినిమా స్క్రిప్టు పూర్తయిందని నిర్మాత విజయ్ కిరగందూర్ ఇప్పటికే చెప్పారు. హీరో, డైరెక్టర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలిపారు. హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ‘సలార్ 2’ ఉంటుందన్నారు.
అయితే సలార్ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ గాని, బాక్సాఫీస్ రిజల్ట్ గాని తనను నిరాశకు గురి చేసింది అనే విధంగా తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కామెంట్ చేసారు. 'కేజిఎఫ్ చాప్టర్ 2' విడుదలైన తర్వాత సలార్ రైటింగ్ మీద తాను ఎంతో కాన్సన్ట్రేషన్ చేశానని, అయితే రిజల్ట్ తనను కాస్త డిజప్పాయింట్ చేసిందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. అయితే సలార్ సీక్వెల్ విషయంలో తానేంటో చూపిస్తానని ఆయన తెలిపారు.
అలాగే ఇప్పటి వరకు తాను రాసిన సినిమాలలో 'సలార్ 2' బెస్ట్ వర్క్ అని ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో చెప్పారు. తన జీవితంలో కొన్ని విషయాలలో తాను సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటానని, అటువంటి కాన్ఫిడెన్స్ 'సలార్ 2' మీద తనకు ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. సలార్ సీక్వెల్ రైటింగ్ వర్క్ కంప్లీట్ అయింది అన్నమాట. సలార్ కోసం తాను చాలా కష్టపడ్డానని, అందుకు తగ్గట్టుగా థియేట్రికల్ పర్ఫార్మెన్స్ లేకపోవడం కాస్త అసంతృప్తి కలిగించిందని చెప్పారు.
ప్రభాస్ అభిమానులలో మాత్రమే కాదు... ప్రేక్షకులలో కూడా 'సలార్ 2' మీద ఎక్సపెక్టేషన్స్ పెంచేశారు ప్రశాంత్ నీల్. ''ఇప్పుడు ప్రేక్షకులు ఊహించుకున్న దానికంటే మించి 'సలార్ 2' ఉంటుంది. నా ఊహకు మించి ఆ సినిమాను తీస్తాను'' అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
ప్రభాస్ డేట్స్ విషయానికి వస్తే... ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ఫౌజీ' షూటింగ్స్ చేస్తున్నారు. ఇటీవల ఆయనకు గాయం కావడంతో చిత్రీకరణలకు కాస్త విశ్రాంతి ఇచ్చారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది అని అన్నారు.