పుష్ప 2: ప్రసాద్స్‌లో ఎందుకు లేదు? అసలు కారణం ఇదీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించబడటం లేదు. రెవెన్యూ షేరింగ్ సమస్య కారణంగా మైత్రి మూవీ మేకర్స్ మరియు ప్రసాద్స్ మధ్య విభేదాలు తలెత్తాయి.
Allu Arjun, #Pushpa2, Sukumar
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘పుష్ప ది రూల్’ ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది.
Allu Arjun, #Pushpa2, sukumar
భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. బుధవారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాని చాలా మంది హైదరాబాద్ ప్రసాద్స్ లో చూద్దామనుకున్నారు. అయితే అక్కడ షోలు లేకపోవటం షాక్ ఇచ్చింది. అందుకు కారణం ఏమిటో చూద్దాం.
తాజాగా విడుదలైన ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule)ను ప్రసాద్ మల్టిప్లెక్స్ లో చూడాలని ఎదురుచూసిన సినీప్రియులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రాన్ని తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ప్రకటించింది. ఈమేరకు గురువారం ఉదయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
Allu Arjun, #Pushpa2, Sukumar
‘‘సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం. దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ‘పుష్ప 2’ను మీకెంతో ఇష్టమైన ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించలేకపోతున్నాం.
మీకు అసౌకర్యం కల్పించినందుకు మేము చింతిస్తున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది. ‘పుష్ప 2’ చిత్రాన్ని ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.
Allu Arjun, #Pushpa2, sukumar
అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ప్రసాద్స్ లో ప్రదర్శించకపోవటానికి ప్రధాన కారణం ..రెవిన్యూ షేరింగ్ సమస్యే అంటున్నారు. సినిమా వలన వచ్చే ఆదాయాన్నిషేర్ చేసుకోవటంపై ప్రసాద్స్ , చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ మధ్య విభేదాలు వచ్చాయి.
మైత్రి సినిమా ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో 55 శాతం ప్రసాద్‌ల నుండి డిమాండ్ చేయగా, మల్టీప్లెక్స్ దాని రెగ్యులర్ రెవిన్యూ షేరింగ్ 52.5 శాతానికి కట్టుబడి ఉంది. PVR మరియు సినీపోలిస్ వంటి ఇతర చైన్‌లు మైత్రీ డిమాండ్‌కు అంగీకరించాయి, అయితే ఈ సినిమాకు కమిటైతే భవిష్యత్ మిగతా నిర్మాతలకు ఓ ఎగ్జాంపుల్ గా నిలుస్తుందని, అందరూ రెవిన్యూ షేరింగ్ విషయంలో బేరాలు మొదలు పెడతారని భయపడి ప్రసాద్స్ తిరస్కరించినట్లు సమచారం.
Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI
పుష్ప: ది రూల్’ ని చూసిన వారంతా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్‌లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన డైలాగులు అలరిస్తాయి.
Allu Arjun, #Pushpa2, sukumar
ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ హైలైట్ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, సంధ్యలో ఏర్పాటుచేసిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఆయన సినిమా చూసారు. ఆయన్ని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీనిపై తాజాగా బన్నీ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని చెప్పింది.