పట్టు వస్త్రాల్లో వజ్రంలా మెరిసిపోతున్న ప్రణీతా.. చీరకట్టుకే అందం తెచ్చిన బుట్టబొమ్మ
కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది.
యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంలో నటిస్తుండటం విశేషం. మరోవైపు పలు ఈవెంట్లకూ హాజరవుతూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం సినిమాలపై ప్రణీతా ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రతి ఈవెంట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. పెళ్లై, ఓ కూతురికి జన్మనిచ్చిన ఏమాత్రం చెక్కుచెదరని అందంతో మిలమిల మెరిసిపోతోంది. ఇక అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ అదరగొడుతోంది.
బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ప్రణీతా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సంప్రదాయ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో నిండుగా దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో తన ఫిదా చేసింది.
బంగారువర్ణపు పట్టుచీర, ఆకర్షణీయమైన జ్యూయెల్లరీలో ప్రణీతా వజ్రంలా మెరిసిపోతోంది. ట్రెడిషనల్ లుక్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుని చూపుతిప్పుకోకుండా చేసింది. క్యూట్ ఫోజులతో అదరగొట్టింది. తన బ్యూటీఫుల్ ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఎప్పుడూ ప్రణీతా నెట్టింట మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు మరిన్ని సినిమా ఆఫర్లకోసం ఎదురుచూస్తోంది. దర్శకనిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘హలో గురు ప్రేమకోసమే’ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి, డెలవరీ తర్వాత మలయాళం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 148వ చిత్రంలో నటిస్తోంది. మాలీవుడ్ లో ఇది ప్రణీతకు తొలిచిత్రం.