వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న ప్రణీత గ్లామర్.. విదేశాల్లో పవన్ హీరోయిన్ రచ్చ.. మతి పోగొడుతున్న స్టిల్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha) నెట్టింట క్రేజీ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా తను పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
కన్నడ బ్యూటీ, హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే ప్రణీత తెలుగు ఆడియెన్స్ లోనూ గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు, తమిళం, హిందీలో వరుసగా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
గతేడాది మే చివర్లో ప్రణీత వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబికుల సమక్షంలో సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భర్తతో కలిసి టూర్లు, వేకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఈ ఏడాది జూన్ 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సినిమాలకు కాస్తా దూరమైన ఈ బ్యూటీ ఫ్యామిలీతో మాత్రం ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తోంది. ఈ సందర్బంగా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను పంచుకుంటోంది.
తాజాగా ప్రణీత పంచుకున్న ఫొటోల్లో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ తో మరింతగా మెరిసిపోతోంది. పెద్దకండ్లతో చురకత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లు అట్రాక్ట్ చేస్తోంది. ప్రణీత బ్యూటీకి నెటిజన్లను కూడా ఫిదా అవుతున్నారు.
పెళ్లి తర్వాత కూడా ప్రణీత తన కేరీర్ ను కొనసాగిస్తోంది. మునుపటి అంతా జోరు ప్రదర్శించకపోయినా.. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ : కథానాయకుడి’లో మెరిసింది. ప్రస్తుతం కన్నడలో ‘రమణ అవతార’లో నటిస్తోంది.