MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • మీరు చేసింది నమ్మకద్రోహం, అడ్డంగా దోచుకున్నారు.. పవన్‌ `హరి హర వీరమల్లు`పై ప్రకాష్‌ రాజ్‌ బోల్డ్ కామెంట్

మీరు చేసింది నమ్మకద్రోహం, అడ్డంగా దోచుకున్నారు.. పవన్‌ `హరి హర వీరమల్లు`పై ప్రకాష్‌ రాజ్‌ బోల్డ్ కామెంట్

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `హరి హర వీరమల్లు` మూవీపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ హాట్‌ కామెంట్‌ చేశారు. అభిమానం పేరుతో ఫ్యాన్స్ ని దోచుకున్నారంటూ ఫైర్‌ అయ్యారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 31 2025, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాష్‌ రాజ్‌ విమర్శలు
Image Credit : Asianet News

పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాష్‌ రాజ్‌ విమర్శలు

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచే మిశ్రమ స్పందన లభించింది. 

మొదటి వీకెండ్‌లో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సుమారు రూ.110కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కానీ వీక్‌ డేస్‌లో మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయింది. ఆల్మోస్ట్ డిజాస్టర్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. 

ఇప్పుడు `కింగ్‌డమ్‌` మూవీ రావడంతో ఆ సినిమా థియేటర్లన్నీ ఎత్తేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై తాజాగా నటుడు ప్రకాష్‌ రాజ్‌ హాట్‌ కామెంట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌పై ఫైర్‌ అయ్యారు. అభిమానాన్ని దోచుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు.

DID YOU
KNOW
?
పవన్‌ కెరీర్‌లోనే అత్యధికం
`హరి హర వీరమల్లు` మూవీ తొలిరోజు రూ.70కోట్లు వసూలు చేసింది. ఇది పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ కావడం విశేషం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అధిక టికెట్‌ రేట్లతో దోచుకుంటున్నారుః ప్రకాష్‌ రాజ్‌
Image Credit : Youtube print shot/@teamprashna

అధిక టికెట్‌ రేట్లతో దోచుకుంటున్నారుః ప్రకాష్‌ రాజ్‌

ప్రకాష్‌ రాజ్‌ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. `హరి హర వీరమల్లు` మూవీ విషయంలో ఫ్యాన్స్ ని అధిక టికెట్‌ రేట్లతో దోచుకున్నారని, కంటెంట్‌ విషయంలో మోసం చేశారని అన్నారు. 

సినిమాల్లో మీ రాజకీయం ఏంటని ప్రశ్నించారు. బలవంతంగా మీ ప్రాపగండాని రుద్దితే జనం చూడరని, అందుకు గట్టిగా సమాధానం చెప్పారని తెలిపారు ప్రకాష్‌ రాజ్‌. ఆయన ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Related Articles

Related image1
Kingdom Review: `కింగ్డమ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండకి సాలిడ్‌ కమ్‌బ్యాక్‌ వచ్చిందా?
Related image2
`హరి హర వీరమల్లు` ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. పవన్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ఎంత తీసుకున్నారంటే?
36
చెత్త సినిమాలు తీస్తున్నారని మీకు తెలియదా
Image Credit : Youtube print shot/@teamprashna

చెత్త సినిమాలు తీస్తున్నారని మీకు తెలియదా

`సినిమా ఇండస్ట్రీకి, ఆడియెన్స్ కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అది కథల పరంగా కావచ్చు, నటన పరంగానూ కావచ్చు. ఈ మధ్య వచ్చిన `హరి హర వీరమల్లు`గానీ, `కన్నప్ప`గానీ, `థగ్‌ లైఫ్‌`గానీ, `గేమ్‌ ఛేంజర్‌`గానీ, ప్రీ రిలీజ్‌ ఎలివేషన్స్ ఏంటి? చెత్త సినిమాలు తీసిన విషయం మీకు తెలియదా. ఎవరికి అమ్ముతున్నారు. 

మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా. `బాహుబలి` లాంటి సినిమాని రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది. బిగ్‌ బడ్జెట్‌ సినిమాలకు అదొక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ. కానీ అదే మేం చేస్తున్నామని చెప్పి, ఎలాంటి సినిమాలను ఇస్తున్నారు. ఇచ్చి ఎలాంటి దోపిడి చేస్తున్నారు. ఎవరిని దోపిడి చేస్తున్నారు. మీ ఫ్యాన్స్ నే కదా` అంటూ ప్రశ్నించారు ప్రకాష్‌ రాజ్‌.

46
రాజకీయ సిద్ధాంతాలను సినిమాలో రుద్దుతారా?
Image Credit : Asianet News

రాజకీయ సిద్ధాంతాలను సినిమాలో రుద్దుతారా?

ఆయన ఇంకా చెబుతూ, `హై బడ్జెట్‌ సినిమాలు అంటున్నారు. మరి ఆ రేంజ్‌లో కథ ఉందా? వీఎఫ్‌ఎక్స్ ఉన్నాయా? ఫైట్స్ ఉన్నాయా? సినిమాకి ఐదేళ్ల(హరి హర వీరమల్లు సినిమాని ఉద్దేశించి) టైమ్‌ ఎందుకు పట్టింది?. 

మీరు అక్కడ ద్రోహం చేసి, వడ్డీలకు వడ్డీలు పెరిగి, కథలను మార్చి, రాజకీయంగా మీరు ఒకస్థాయిలో ఉన్నారని, అందులో మీ రాజకీయ సిద్ధాంతాలను రుద్ది దాన్ని ఓ సినిమాగా తీయాలని వచ్చి, దానికి మేం ఇంత కష్టపడ్డామని చెబుతున్నారు. 

సినిమా ప్రమోషన్స్ కి పది రోజులు ఎంత నిజాయితీగా వచ్చారో, అలా ముందే షూటింగ్‌కి వచ్చి ఉంటే రెండేళ్ల క్రితమే సినిమా విడుదలయ్యేది కదా? `అంటూ మండిపడ్డారు ప్రకాష్‌ రాజ్‌.

56
రజనీకాంత్‌ `బాబా` సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
Image Credit : Youtube print shot/@teamprashna

రజనీకాంత్‌ `బాబా` సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తావన తెస్తూ, `రజనీకాంత్‌ `బాబా` మూవీ తీశారు. తనే కథ రాసి, ప్రొడ్యూస్‌ చేసిన సినిమా అది. విడుదల రోజు చెన్నైలో ఓ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఓ సైకిల్‌పై వెళ్లే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు. 

అంతకు ముందు రెగ్యూలర్‌గా అదే రోడ్డుపై ఉంటాడు. అప్పుడప్పుడు డబ్బులిస్తుంటాను. ఆ రోజు ఏడుస్తూ కనిపించాడు. కారు ఆపి, ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే, రెండు వందల టికెట్‌ సార్‌, బాస్‌ మోసం చేశారు అన్నాడు. 

ఇప్పుడు ఈ మూవీని చూసింది చాలా మంది పవన్‌ కళ్యాణ్‌గారి ఫ్యాన్సే కదా, వారిని మోసం చేశామని మీకు తెలియడం లేదా? ఎవరిని దోచుకుంటున్నావు, ఏంటీ ఈ ప్రాపగండా సినిమాల గోల` అని కామెంట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌.

66
డైరెక్టర్‌కి స్వేచ్ఛ ఇవ్వలేదు
Image Credit : Youtube print shot/@teamprashna

డైరెక్టర్‌కి స్వేచ్ఛ ఇవ్వలేదు

ఈ సందర్భంగా మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌లకు సంబంధించిన ప్రస్తావన తెస్తూ, `ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు స్టేజ్ పై `మేం మేం ఫ్రెండ్స్, మీరు కొట్టుకోవద్దు` అన్నారు. కానీ మీరేం(పవన్‌ కళ్యాణ్‌) చెబుతున్నారు. తిరిగి కొట్టమంటాడా? చొక్కా చిచ్చుకుని ప్రేమిస్తుంటే వారిని నువ్వు సైనికులు అనుకుంటున్నావా? ఇది పెద్ద నాన్సెన్స్. 

కానీ జనాలు మూర్ఖులు కాదు. ప్రధాని మోడీ  బయోపిక్‌ తీస్తే, ఆ సినిమాని వంద మంది కూడా చూడలేదు. ఈ ప్రాపగండా సినిమాలను జనం చూడరు. నీ ఫ్యాన్సే ఉమ్ముతున్నారు. నువ్వేదో ప్రయోగం చేస్తే అది ఫెయిల్‌ అయితే బాధపడొచ్చు, కానీ ఇది నీ సోమరితనం వల్ల, అహాంకారం వల్ల ఐదేళ్లు అయ్యింది. 

మొదట ఒక దర్శకుడిని అనుకున్నారు. తర్వాత మరో డైరెక్టర్‌ని తీసుకొచ్చారు. ఆ డైరెక్టర్‌ అనుకున్న కథని అనుకున్న విధంగా తీసే స్వేచ్ఛ ఇచ్చారా మీరు. సినిమా వేరే, రాజకీయం వేరు. మీరు పాపులర్‌ అయ్యిందే వినోదం ద్వారా, అలాంటిదాంట్లోకి మరోటి బలవంతంగా రుద్దడం ఎంత వరకు కరెక్ట్. 

నేను బయట రాజకీయాలు మాట్లాడతా. కానీ నా సినిమాల్లో రాజకీయాలు మాట్లాడను, అది సెపరేట్‌ గేమ్‌. రెండింటిని ఇన్‌వాల్వ్ చేయను. ఇలాంటి వారికి జనాలు సమాధానాలు ఇస్తున్నారు. కానీ ప్రశ్నించే గొంతుకలు లేవాలి` అని అన్నారు ప్రకాష్‌ రాజ్‌.

 ప్రశ్న యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు ప్రకాష్‌ రాజ్‌. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Recommended image2
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image3
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Related Stories
Recommended image1
Kingdom Review: `కింగ్డమ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండకి సాలిడ్‌ కమ్‌బ్యాక్‌ వచ్చిందా?
Recommended image2
`హరి హర వీరమల్లు` ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. పవన్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved