- Home
- Entertainment
- విస్కీ యాడ్‌లో యమ హాట్‌గా ప్రగ్యా జైశ్వాల్.. ఇలా చేస్తే అన్‌ఫాలో చేస్తామంటూ నెటిజన్ల హెచ్చరిక..
విస్కీ యాడ్‌లో యమ హాట్‌గా ప్రగ్యా జైశ్వాల్.. ఇలా చేస్తే అన్‌ఫాలో చేస్తామంటూ నెటిజన్ల హెచ్చరిక..
ఆ మధ్య సమంత ఆల్కహాల్ యాడ్ ప్రమోట్ చేస్తూ బోల్డ్ గా కనిపించింది. ట్రోల్స్ కి గురైంది. ఇప్పుడు ప్రగ్యాజైశ్వాల్ కూడా అదే చేసింది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలెదుర్కొంటుంది. కొందరు నెటిజన్లు హెచ్చరించడం వైరల్ అవుతుంది.

`అఖండ` చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకుని ఫుల్ జోష్‌లోకి వచ్చింది ప్రగ్యా జైశ్వాల్. సినిమాలే లేవు, కెరీర్ అయిపోతుందనే సమయంలో బాలయ్య ఆమెని ఆదుకున్నాడు, మళ్లీ నిలబెట్టాడు. `అఖండ` సక్సెస్‌తో ప్రగ్యాలో ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీతో దూసుకుపోతుంది. గ్లామర్ వైపు బ్రేకుల్లేని బుల్డోజర్ అనిపించుకుంటోంది. తాజాగా ఆమె నెటిజన్ల విమర్శలు ఎదుర్కోవడం హాట్ టాపిక్ అవుతుంది.
ప్రగ్యాజైశ్వాల్.. ఓ ఫారెన్ బ్రాండ్ విస్కీ ప్రమోషన్‌లో పాల్గొంది. ఆ విస్కీ బాటిల్ ముందు పెట్టుకుని హాట్ పోజులిచ్చింది. క్లీవేజ్ అందాలతో యమ హాట్‌గా తయారైంది. బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఈ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రగ్యా. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ప్రగ్యా హాట్‌నెస్‌కి మంత్రముగ్దులు అవుతున్నారు ఆమె అభిమానులు.
అయితే ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. `ఇలాంటి యాడ్లు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు` అంటూ కామెంట్లు పెడుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి యాడ్లు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీపై మంచి అభిప్రాయంతో ఉన్నామని, కానీ ఇలా చేసి ఆ ఓపీనియన్ పోగొట్టుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు.
అంతటితో ఆగడం లేదు.. ఇలాంటి యాడ్లు చేస్తే మిమ్మల్ని అన్ ఫాలో చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ హానికరమనే విషయం తెలిసీ కూడా వాటిని ప్రమోట్ చేయడమేంటి? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఒక్క ఫోటోతో `అఖండ`తో వచ్చిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటుంది ప్రగ్యా అంటున్నారు నెటిజన్లు.
మరికొందరు ప్రగ్యాకి మద్దతు పలుకుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూనే ఆమె చేసిన దాంట్లో తప్పేమి లేదంటున్నారు. ఆమె ఆల్కహాల్ ప్రమోట్ చేయకపోతే జనాలు తాగడం ఆపేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నటిగా ఆమె ఇలాంటి యాడ్స్ చేయడం కెరీర్‌లో మరో ముందడుగా చెబుతున్నారు. ఆమె ఏం చేయాలనేది ఆమె వ్యక్తిగత విషయమని కౌంటర్లిస్తున్నారు.
అయితే ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలాంటి విమర్శలే ఎదుర్కొంది. ఆమె ఓ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ కోసం బోల్డ్ గా ఫోటో షూట్ ఇవ్వడం, ర్యాంప్ వాక్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె అభిమానులే సమంత అలా చేయడాన్ని తీసుకోలేకపోయారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. డబ్బు కోసం ఇంతగా దిగజారుతారా అంటూ కామెంట్లు చేశారు. దానిపై సమంత కూడా అదే స్థాయిలో స్పందించి ట్రోలర్స్ నోళ్లు మూయించింది. మరి ఇప్పుడు ప్రగ్యా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.