ఫారిన్ టూర్ లో ప్రగ్యా జైస్వాల్, ఫిన్లాండ్ వీధుల్లో బాలయ్య భామ సందడి
ఫారిన్ టూర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. చేతిలో సినిమాలు లేకపోవడంతో బ్యూటీ ఖాళీగా ఉన్నట్టుంది.. ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయింది.

కెరీర్ ను పక్కాగాప్లాన్ చేసుకోలేకపోయింది ప్రగ్యా జైస్వాల్. టాలీవుడ్ ఎంట్రీ అద్భఉతంగా జరిగినా.. ఆతరువాత వచ్చిన ఫేమ్ ను నిలబెట్టుకోలేకపోయింది. కంచె సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ప్రగ్యా.. ఆతరువాత అఖండ వరకూ.. సాలిడ్ హిట్ కొట్టింది లేదు. బాలయ్య తో అఖండ మూవీ బ్రేక్ ఇచ్చినా ప్రగ్యాజైస్వాల్ పరిస్థితి ఏమాత్రం మారలేదు.
ఇక జయ జానకీ నాయక లాంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది బ్యూటీకి. అయినా ఏమాత్రం నిరూత్సాహపడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది బ్యూటీ. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక్కడ ఫాలోయింగ్ పెంచుకోవడంలో.. స్పీడ్ గా ఆలోచిస్తోంది బ్యూటీ.
రీసెంట్ గా ఆమె ఫారిన్ ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఫిన్లాండ్ వెళ్ళిన బ్యూటీ.. అక్కడి అందాలకు మైమరచిపోతోంది. ఫిల్లాండ్ రాజధాని వీధుల్లో తిరుగుతూ.. ఫోటోలు దిగుతూ.. సోషల్ మీడియాలో అభిమానుల కోసం శేర్ చేస్తోంది.
ఇక రీసెంట్ గా బాలయ్య బాబుతో కలిసి మరోసారి సందడి చేసింది ప్రగ్యా జైస్వాల్. ఓ జ్యూవ్వెల్లరీ యాడ్ లో ఆయనతో కలిసి నటించింది. అంతే కాదు... ఆ జువ్వెల్లరీ షాప్ ఓపెనింగ్ కు బాలకృష్ణతో కలిసి పాల్గొంది ప్రగ్యా. బెజబాడలో తెగ సందడి చేసింది. పట్టుచీరలో మెరిసిపోయింది చిన్నది.
ప్రగ్యా కెరీర్ మరింత డల్ అయ్యింది. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.