- Home
- Entertainment
- Pradeep Rawat: 36 ఏళ్ల క్రితమే మరణాన్ని జయించిన ప్రదీప్ రావత్.. సముద్రంలో పెను ప్రమాదం
Pradeep Rawat: 36 ఏళ్ల క్రితమే మరణాన్ని జయించిన ప్రదీప్ రావత్.. సముద్రంలో పెను ప్రమాదం
విలన్ పాత్రలతో ఆకట్టుకున్న ప్రదీప్ రావత్ తాజాగా కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన 36ఏళ్ల క్రితమే చావుని జయించారు. చావు అంచువరకు వెళ్లి వచ్చారు.

క్యాన్సర్‌తో మరణించిన ప్రదీప్ రావత్
ప్రముఖ టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ తెలుగులోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ విలన్‌గా చేసి మెప్పించాడు. తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన మరణం అత్యంత బాధాకరం. చిత్ర పరిశ్రమకి తీరని లోటని చెప్పొచ్చు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం హార్ట్ ఎటాక్‌తో తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకం ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇలా అనేక మంది ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
36ఏళ్ల క్రితమే మరణాన్ని జయించిన ప్రదీప్ రావత్
అయితే ప్రదీప్ రావత్ 36ఏళ్ల క్రితమే మరణాన్ని జయించారు. ఆయన సముద్రంలో పడిపోయి ప్రాణాలతో పోరాడారు. కొద్దిపాటితో ఆయన బతికిపోయారు. సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన చావు వరకు వెళ్లి బయటపడ్డారు. ఏం జరిగిందనేది చూస్తే, ప్రదీప్ రావత్ సినిమా జర్నీలో ఎన్నో సాహసోపేత చిత్రాల షూటింగ్‌లలో పాల్గొన్నారు. ముఖ్యంగా హిందీ సినిమా `మహా సంగ్రామ్` చిత్రం చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ పడవ ప్రమాదం అప్పట్లో యూనిట్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. షూటింగ్‌లో భాగంగా నీటిపై తెరకెక్కిస్తున్న సన్నివేశంలో పడవ అదుపుతప్పడంతో అక్కడున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మహా సంగ్రామ్ షూటింగ్‌లో ప్రమాదం
వినోద్ ఖన్నా, గోవిందా, మాధురీ దీక్షిత్ వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మహాసంగ్రామ్`, ముకుల్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1990లో విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓడలో యాక్షన్ సీన్ చిత్రీకరించారు. వినోద్ ఖన్నా.. ప్రదీప్ రావత్‌ని కొట్టుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇలా ఓడ ఎండింగ్ వరకు ప్రదీప్ రావత్ వెళ్లాల్సి ఉంటుంది. చివర్లో ఆయన్నుంచి తప్పించుకోవాలి. కానీ ప్రదీప్ రావత్.. కాలు జారి సముద్రంలో పడిపోయారు. ఆయన పడిపోవడంతో సముద్రంలో అలల తాకిడి పెరిగింది. ఓడకి దూరంగా వెళ్లిపోయాడు. దీనికితోడు సుడిగుండం ఏర్పడింది. అది మరింత ఇబ్బంది పెట్టింది. ఓడలో ఉన్న సిబ్బంది ఆయన్ని లాగే పరిస్థితి లేదు. వారికి దూరంగా వెళ్లిపోయాడు. కనిపించడం లేదు. ఇక ప్రదీప్ పని అయిపోయిందనుకున్నారు.
పెద్ద గండం నుంచి తప్పించుకున్న రావత్
కానీ అంతలోనే ఆయనకు ఒక ఇనుప గడ్డి దొరికింది. దాన్ని పట్టుకని అలానే ఉండిపోయాడు. గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న జాలర్లు వచ్చి ప్రదీప్‌ని కాపాడారు. అలా ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న చిత్రబృందం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ సంఘటనను యూనిట్‌లో పనిచేసిన పలువురు సభ్యులు ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. మొత్తంగా అలా ప్రదీప్ రావత్ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు. తెరపై ఎంత భీకరమైన విలన్‌గా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం ప్రదీప్ రావత్ ఎంతో క్రమశిక్షణ గల నటుడిగా, సహనటులతో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
తెలుగులో స్టార్ విలన్‌గా ఎదిగిన ప్రదీప్ రావత్
ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా ధైర్యంగా పాల్గొనడం, షూటింగ్‌పై పూర్తి అంకితభావంతో పనిచేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఈ కారణంగానే దర్శకులు, నిర్మాతల విశ్వాసాన్ని ఆయన సంపాదించుకున్నారు. 'సై', 'ఘజిని', 'ఛత్రపతి', 'సరైనోడు', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రదీప్ రావత్. స్టార్ విలన్‌గా మెరిసి మెప్పించారు.

