- Home
- Entertainment
- పుట్టెడు దుఃఖంలో ప్రభాస్.. కాస్త ఊరట కలిగించేలా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, అరుదైన గౌరవం..
పుట్టెడు దుఃఖంలో ప్రభాస్.. కాస్త ఊరట కలిగించేలా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, అరుదైన గౌరవం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని ఫ్యామిలీ ప్రస్తుతం తీరని శోకంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలో కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని ఫ్యామిలీ ప్రస్తుతం తీరని శోకంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిన్ననే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులంతా కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.
తన వెన్నంటే ఉండి నడిపించిన పెదనాన్న దూరం కావడంతో ప్రభాస్ కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ దృశ్యాలు అభిమానులని ఎంతగానో కలచివేశాయి. ప్రభాస్ ని అలా చూస్తూ అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన గౌరవం దక్కబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలలో చివరి రోజు రావణాసుర దహన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సెలెబ్రిటీలని అతిథుల్ని ఆహ్వానించడం ఆనవాయితీ. సెలెబ్రటీల చేతుల మీదుగా రవాణ దహన కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ కి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. దీనితో రవాణ దహన కార్యక్రమానికి ప్రభాస్ కన్నా మించిన అతిథి లేరు అంటూ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పురాణాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి వేడుకల్ని ఇండియా మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. గడ్డి, చెక్క ఇతర వస్తువులతో పది తలల రావణాసుర భారీ విగ్రహాన్ని తయారు చేసి దసరా ఉత్సవాల చివరి రోజున దహనం చేస్తారు. ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయాన్ని లవ్ కుశ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ధ్రువీకరించారు.
రావణాసురతో పాటు కుంభకర్ణ, మేఘనాథ బొమ్మలు కూడా దహనం చేస్తారు. ఈ మూడింటిపై ప్రభాస్ బాణం సంధించి దహనం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా అలరించబోతున్నాడు. శ్రీరాముడిగా ఈ చిత్రంలో ప్రభాస్ గెటప్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.