- Home
- Entertainment
- ప్రభాస్ స్టైలిష్ లుక్ అదుర్స్.. డార్లింగ్ మరీ ఇంత స్లిమ్ గా అయ్యాడేంటి.. పిక్స్ వైరల్..
ప్రభాస్ స్టైలిష్ లుక్ అదుర్స్.. డార్లింగ్ మరీ ఇంత స్లిమ్ గా అయ్యాడేంటి.. పిక్స్ వైరల్..
కొద్దిరోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ బరువు తగ్గుతూ వస్తున్నారు. ‘రాధే శ్యామ్’ అనంతరం మరీ స్లిమ్ గా తయారయ్యాడు. లేటెస్ట్ గా డార్లింగ్ న్యూ లుక్ పిక్స్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. చాలా స్టైలిష్ గా అందరినీ ఆకట్టుకుంటున్నారు ప్రభాస్.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి సినిమాకు తన బాడీలో మాత్రం పూర్తి ఛేంజ్ చూపిస్తారు. వెయిట్ పెరగడం, తగ్గడం ప్రభాస్ ఒక నిత్య ప్రక్రియలాగే అయిపోయిందని చెప్పాలి. అందుకే సినిమా సినిమాకు తన బాడీ ట్రాన్స్ ఫామింగ్ వేరే లెవల్ లో ఉంటోంది.
అయితే తాజాగా ఇంటర్నెట్ లో ప్రభాస్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో డార్లింగ్ చాల అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ జీన్స్, డార్క్ కలర్ షర్ట్ ధరించి న్యూ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. అయితే ఏక్ నిరంజన్ మూవీలో లాగా హాఫ్ ఇన్ షర్ట్ మాత్రమే వేసి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’ నుంచి ప్రభాస్ తన ఫిజికల్ ఫిట్ నెస్ పై చాలా ఫోకస్ పెడుతున్నారు. అలాగే గ్లామర్ పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బహుబలి కోసం ఏకంగా 120 కిలోల బరువు పెరిగిన ప్రభాస్ ఆ తర్వాత వెంటనే మొత్తం బరువును దించేశాడు.
చివరిగా సాహో, రాధే శ్యామ్ చిత్రాల్లో, ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ చాలా బొద్దుగా కనిపించారు. ‘సలార్’ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రభాస్ తన ఫిట్ నెస్ ను మళ్లీ దారిలోకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద ‘బుజ్జిగాడు’ స మయంలో ఎంత సన్నగా మారిపోయాడో.. ప్రస్తుతం ఇంచు మించు అలాగే ఉన్నాడు.
ఫిజికల్ ఫిట్ నెస్ తోపాటు, ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తుండటంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. డార్లింగ్ ఈ కటౌట్ లో చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’(Adhpurush) చిత్ర యూనిట్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఆయన పిక్స్ కూడా నెట్టింట్లోకి వచ్చాయి.
‘రాధే శ్యామ్’ చిత్రంతో అభిమానులను కాస్తా నిరాశ పరిచిన ప్రభాస్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ మూవీల్లో నటిస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’, డైరెక్టర్ మారుతీతో ‘డిలక్స్ రాజా’ చిత్రాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.