- Home
- Entertainment
- Adipurush Review: ఆదిపురుష్ ట్విట్టర్ టాక్... రాముడిగా ప్రభాస్ అద్భుతం, అసలు లోపం అక్కడే,సినిమా టాక్ ఏందంటే?
Adipurush Review: ఆదిపురుష్ ట్విట్టర్ టాక్... రాముడిగా ప్రభాస్ అద్భుతం, అసలు లోపం అక్కడే,సినిమా టాక్ ఏందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ పౌరాణిక చిత్రం జూన్ 16న విడుదలైంది. అభిమానులు, చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉండగా ఆదిపురుష్ మూవీ ఎలా ఉందో చూద్దాం...
- FB
- TW
- Linkdin
Follow Us

కథ:
రామాయణం తెలియని భారతీయుడు బహుశా ఉండడు. చిన్నప్పటి నుండి అనేక విధాలుగా ఈ కథ మన మనస్సులో నాటుకుపోయింది. కాబట్టి ఆదిపురుష్ కథ అందరికీ తెలిసిందే. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల సమాహారమే ఆదిపురుష్ మూవీ. తండ్రి మాట కోసం రాఘవుడు(ప్రభాస్) 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళతాడు. రాఘవుడిని మభ్యపెట్టి లంకేశ్వరుడు(సైఫ్ అలీ ఖాన్) జానకి(కృతి సనన్) ని అపహరిస్తాడు. లంకలో ఉన్న జానకిని వానర సైన్యం సహాయంతో లంకేశ్వరుడిని అంతమొందించి రాఘవుడు ఎలా కాపాడాడు? అనేదే ఆదిపురుష్ కథ...
ఆదిపురుష్ అటు ప్రభాస్ కి ఇటు దర్శకుడు ఓం రౌత్ కి సవాల్ తో కూడిన చిత్రం. రామాయణం వంటి సబ్జెక్టుని టచ్ చేయడం, దాన్ని ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. అందరికీ తెలిసిన రామాయణ కథను నేటి సాంకేతికత వాడుకొని ఆ ఘట్టాలను విజువల్ వండర్స్ గా తీర్చిదిద్దాలి. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయాలి. ప్రధాన పాత్రల నటన, విఎఫ్ఎక్స్ వర్క్, కథనంతో మెప్పించాలి..
Adipurush Review- Twitter Talk
ఆదిపురుష్ మూవీ ప్రీమియర్స్ ముగియగా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అనూహ్యంగా ఆదిపురుష్ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఆదిపురుష్ ని తిరుగులేని చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ నటన అద్భుతం, విఎఫ్ఎక్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ మెప్పించాడని అంటున్నారు.
Adipurush Review- Twitter Talk
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యేలా దర్శకుడు ఓం రౌత్ డ్రామా నడిపించారని అంటున్నారు. సాంగ్స్ మరో ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ సక్సెస్ అయ్యారంటున్నారు. ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు.
అదే సమయంలో ఆదిపురుష్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనుకున్నట్లే పలువురు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా పూర్ గా ఉన్నాయని అంటున్నారు. ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీపై ఇలాంటి కామెంట్స్ ఊహించనివే. టీజర్ చూసిన వెంటనే పలువురు ఇదే లోపం లేవనెత్తారు.
అలాగే లంకేశ్వరుడిగా సైఫ్ లుక్ డిజైన్ చేసిన తీరు పట్ల కూడా పెదవి విరుస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల్లోని విలన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని ఓం రౌత్ లంకేశ్వరుడు పాత్రను డిజైన్ చేసినట్లు ఉన్నారు. రామాయణంలోని రావణుడిని చూసిన భావన కలగదంటున్నాను. దీన్ని ప్రధాన లోపంగా అభివర్ణిస్తున్నారు.
మొత్తంగా ఆదిపురుష్ మూవీపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు ఆడియన్స్ అన్ని విధాలుగా ఆదిపురుష్ మూవీ అబ్బురపరిచిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సెకండ్ హాఫ్ మెప్పించలేదు. కథనం నెమ్మదించింది, పూర్ గ్రాఫిక్స్ అంటున్నారు. రామాయణ పాత్రల లుక్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునుంచే ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. పూర్తి రివ్యూ వస్తే కానీ ఆదిపురుష్ ఫలితం మీద ఓ నిర్ణయానికి రాగలం. ట్విట్టర్ టాక్ అయితే ఇలా ఉంది.