ప్రభాస్ బలహీనత బయట పెట్టిన ప్రభాస్ శ్రీను, రెబల్ స్టార్ ఏమనేవారంటే..?
ఏ స్టార్ కు అయినా అందరికి అన్ని విషయాలు తెలియవు. కొన్ని విషయాలు వారికి దగ్గరగా ఉన్నవారికి మాత్రమే తెలుస్తాయి. అలా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఆయన మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రభాస్ శ్రీను కొన్ని విషయాలు పంచుకున్నారు. కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఎంత పెద్ధ స్టార్ అయినా కొన్ని బలహీనతలు కామన్. వాటివల్లే కొన్ని సందర్బాల్లో ఇబ్బందులు పడుతుంటారు స్టార్లు. కొంత మందికి అవే ప్లాస్ పాయింట్స్ గా కూడా మారుతుంటాయి. అలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయట.
సినిమాల విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కింగ్.. పర్సనల్ గా కూడా ఆయన మంచి వ్యాక్తి ఎవరికి తెలియకుండా ఎంతో మందిని ఆదుకున్న మంచి మనసు ప్రభాస్ ది. ఎవరు వచ్చినా కడుపునిండ తిండి పెట్టంది పంపించడు డార్లింగ్. ఆక సినిమాల విషయం చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్టార్ గా దేశం మొత్తం తెలుసు. ఇక ఈ విషయాలు కాసేపు పక్కన పెట్టేస్తే..
ప్రభాస్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు అతని అసిస్టెంట్ ప్రభాస్ శ్రీను. ఇమేజ్ పెరిగింది కాబట్టి మనం కూడా మారాలి అనే ఆలోచన ప్రభాస్ లో ఉందడట. ఎప్పుడూ ఒకేలా ఉంటాడట ప్రభాస్. అంతే కాదు..అతటి ప్రభాస్ కు బలహీనత కూడా ఉందట. అది అతని మంచితనమే అంటున్నాడు ప్రభాస్ శ్రీను.
ప్రభాస్ కు అతని మంచితనమే.. ప్లాస్ అప్పుడప్పుడు అదే అతని మైనస్ కూడా అవుతుందట. అతనికి కనుక ఎవరి పై అయినా కోపం వస్తే అసలు వాళ్ళతో మాట్లాడడు. అతని నవ్వు ఎంత బాగుంటుందో.. అతని సైలెన్స్ అంతకుమించి భయంకరంగా ఉంటుంది అన్నారు ప్రభాస్ శ్రీను. అందుకే ప్రభాస్ గురించి తెలిసవాళ్లు ఎవరూ అతనితో సాధారణంగా ఎవ్వరూ గొడవపడరు అంటూ చెప్పాడు శ్రీను.
సీతయ్య సినిమాతో యాక్టర్ గాలైఫ్ స్టార్ట్ చేశాడు ప్రభాస్ శ్రీను. ప్రభాస్ అసిస్టెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసిన శ్రీనుకి ప్రభాస్ శ్రీను అనే పేరు ఫిక్స్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యామిలీకి ఆయన చాలా క్లోజ్. ప్రభాస్ వల్లనే ఇతను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని టాప్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రభాస్ కు దగ్గరగా ఉంటాడు కాబట్టి ప్రభాస్ గురించి చాలా విషయాలు తెలుసు శ్రీనుకి.
అంతే కాదు రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా.. ప్రభాస్ ను రాజు గారు అంటే.. ప్రభాస్ శ్రీనుని మంత్రి గారు అని అంటుండేవారట. ఇక ప్రభాస్ చాలా మంచోడని. స్టార్ అవ్వకముందు.. స్టార్ అయ్యాక.. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక కూడా అతను ఒకేలా ఉన్నాడని.. శ్రీను చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది..ఆయన గురించి ఫ్యాన్స్ దగ్గర నుంచి అంతా ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే.. అతని పెళ్లి టాపిక్ గురించే మాట్లాడుకోవాలి. కానీ సల్మాన్ ఖాన్ పెళ్ళి తర్వాత తన పెళ్ళి అంటూ.. బాంబ్ పేల్చేశాడు ప్రభాస్. దాంతో ప్రభాస్ పెళ్ళి విషయంలో నిరాశే ఎదురయ్యింది ఫ్యాన్స్ కు.
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి. వీటితో పాటు మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.