MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్ కి బట్టతల... ఆ ఫోటో నిజమా? ప్రచారమా?

Prabhas: ప్రభాస్ కి బట్టతల... ఆ ఫోటో నిజమా? ప్రచారమా?

హీరో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో రెండు రోజులుగా వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ప్రభాస్ బట్టతలతో ఉన్నారు. ఈ క్రమంలో ఇది నిజమా, ప్రచారమా? అనే చర్చ నడుస్తుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 29 2023, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Prabhas

Prabhas

చక్కని హెయిర్ స్టైల్ ఉన్న హీరోల్లో ప్రభాస్(Prabhas) ఒకరు. బాహుబలి సిరీస్లో ఆయన లాంగ్ హెయిర్ తో యువరాజు పాత్రలో మెప్పించాడు. బాహుబలి చిత్రాల్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. జపాన్ లో కూడా ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


అయితే సాహో చిత్రంలో ప్రభాస్ లుక్ విమర్శల పాలైంది. ఆయన ఫేస్ లో మునుపటి గ్లో మిస్ అయ్యింది. వాయిస్ కూడా మారిపోయింది. సాహోలో ప్రభాస్ డైలాగ్స్ కొన్ని అర్థం కాని పరిస్థితి. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే కర్లీ, మెస్సీ లుక్ లో దర్శనమిచ్చాడు. రాధే శ్యామ్ లో కూడా ప్రభాస్ ఏమంత అందంగా కనిపించలేదు. 

38
Prabhas

Prabhas

ఇక ప్రభాస్ కి జుట్టు పోయిందనే ప్రచారం ఉంది. ఆయన విగ్గుతో మైంటైన్ చేస్తున్నారనే టాక్ ఉంది. దానికి తోడు ప్రభాస్ పబ్లిక్ లో ఎక్కువగా తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తారు. వింటర్ లో ధరించే కాటన్ బీనీ క్యాప్ ధరిస్తారు. ఇది కూడా ఆయనకు జుట్టు ఊడిపోయిందనే అనుమానాలకు తావిస్తోంది.

48

ఆ మధ్య ఓ వీడియో వైరల్ అయ్యింది. పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ జుట్టు సరి చేస్తుంటే... ఇవన్నీ ముందే చూసుకో, బయటకు చేయకు అని ప్రభాస్ తనకు చెప్పారు. ఇవ్వన్నీ వెరసి ప్రభాస్ కి బట్టతల వచ్చిందా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

58
Prabhas

Prabhas

సదరు ఫొటోలో ప్రభాస్ లేడీ ఫ్యాన్ తో ఫోటో దిగారు. ఆయన జుట్టు లేకుండా బట్టతలతో కనిపించారు. ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆ ఫోటో పూర్తిగా ఫేక్. ప్రభాస్ కి బట్టతల రాలేదు. ఎవరో మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో వదిలారు. ఇది యాంటీ ఫ్యాన్స్ ఎడిటింగ్ మాయాజాలం మాత్రమే అని తేల్చేశారు.

68

కాబట్టి ప్రభాస్ బట్టలతో ఉన్న ఆ ఫోటో పూర్తిగా ఫేక్. గతంలో కూడా మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో ఇలానే వైరల్ చేశారు. ఆ ఫోటోలో మహేష్ బాబు బట్టతలతో కనిపించారు. సాధారణంగా యాంటీ ఫ్యాన్స్ వారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడతారు. 
 

78

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే సలార్(Salaar) తో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కాగా భారీ హైప్ నెలకొంది. 

 

88

అలాగే రాజా డీలక్స్ టైటిల్ తో దర్శకుడు మారుతీతో ఓ మూవీ చేస్తున్నారు. ఇది కూడా చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి వచ్చే ఏడాది విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Recommended image2
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Recommended image3
Varanasi: రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved