MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్

Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్

ఈమధ్య ఫిల్మ్ స్టార్స్ వారి అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ మెహరీన్ కూడా అదే చేసింది. సడెన్ గా పెళ్లి చేసుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆమె ఎవరిని పెళ్లాడిందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2026, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎంగేజ్మెంట్ ఒకరితో.. పెళ్లి మరొకరితో..
Image Credit : @mehreenpirzadaa

ఎంగేజ్మెంట్ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పిర్జాదా. పెళ్లి వార్తతో ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడా చిన్న క్లూ కూడా ఇవ్వకుండా పెళ్లి బట్టలతో వరుడిని పక్కన పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది మెహరీన్. ఈ హీరోయిన్ ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆమె ఎంగేజ్మెంట్ ఒకరితో జరిగింది.. పెళ్లి మాత్రం మరొకరితో జరిగింది. ఇంతకీ ఏంటా డబుల్ లవ్ స్టోరీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిమానులకు షాక్ ఇచ్చిన నాని హీరోయిన్..
Image Credit : Instagram / Mehreen Pirzada

అభిమానులకు షాక్ ఇచ్చిన నాని హీరోయిన్..

ఈమధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు మెహరీన్. టాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశాలు కూడా రావడంలేదని సమాచారం. ఇక ఈక్రమంలోనే సడెన్ గా పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది బ్యూటీ. తన ప్రేమ గురించి ఎలాంటి రూమర్స్ వినిపించలేదు. కనీసం ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా.. సైలెంట్ గా, సీక్రేట్ గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మొదటగా ప్రేమించిన వ్యక్తి వేరు.. ఇప్పుడు పెళ్లాడిన వ్యక్తి వేరు కావడంతో అభిమానులు కన్ప్యూజ్ అవుతున్నారు.

Related Articles

Related image1
Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..
Related image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
35
పంజాబీ నటుడిని పెళ్ళాడిన మెహరీన్..
Image Credit : Asianet News

పంజాబీ నటుడిని పెళ్ళాడిన మెహరీన్..

మెహరీన్ పిర్జాదా పంజాబీ నటుడు అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగినట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్, ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి ఏర్పాట్ల గురించి ఎలాంటి వివరాలు ముందుగా ఆమె వెల్లడించలేదు. మెహరీన్ కు ఇది మొదటి ప్రేమ కాదు. 

మెహరీన్ జీవితంలో ఐదేళ్ల క్రితమే ప్రేమ పుట్టింది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి, నిశ్చితార్థం కూడా చేసుకుంది. 2021లో హర్యానాకు చెందిన ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మెహరీన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే భవ్య బిష్ణోయ్‌తో కలిసి ఉన్న ఫోటోలను కూడా ఆమె పంచుకుంది.

45
పంజాబ్ ఎమ్మెల్యేతో నిశ్చితార్థం..
Image Credit : our own

పంజాబ్ ఎమ్మెల్యేతో నిశ్చితార్థం..

అయితే, ఈ నిశ్చితార్థం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని నెలల తర్వాతే మెహరీన్ ‌- ‌భవ్య బిష్ణోయ్ విడిపోయారు. ఈ బ్రేకప్‌కు కారణమేంటి అనేదానిపై స్పష్టత రలేదు. ఆ తర్వాత మెహరీన్ తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వివరాలు తెలియకుండా.. జాగ్రత్తపడింది. పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ చేసింది. అయితే మెహరీన్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తరువాత భవ్య బిష్ణోయ్ ఒక ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకున్నాడు. ఆఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

55
మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్..
Image Credit : our own

మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్..

ఈలోపు మెహరీన్ మళ్లీ ప్రేమలో పడింది. కానీ ఈసారి ఈ విషయాన్ని ఆమె చాలా రహస్యంగా ఉంచింది. కనీసం పెళ్లికి ముందు కూడా ఆహె అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఒక్కసారిగా అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఏప్రిల్ 26న జరిగిన ఈ వివాహం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. 

మెహరీన్ పిర్జాదా చేసుకున్న ఈ సడెన్ మ్యారేజ్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక అభిమానులు మాత్రం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎటువంటి సినిమాలు లేవు. మరి మెహరీన్ ఇండస్ట్రీలో కొనసాగుతుందా? లేక ఫ్యామిలీకే పరిమితం అవుతుందా చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image2
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image3
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Related Stories
Recommended image1
Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..
Recommended image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved