- Home
- Entertainment
- బ్రేకింగ్ న్యూస్, ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రాస్ స్టార్ యష్, ఏ సినిమాలో..? ఎప్పుడు..?
బ్రేకింగ్ న్యూస్, ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రాస్ స్టార్ యష్, ఏ సినిమాలో..? ఎప్పుడు..?
సిల్వర్ స్క్రీన్ పైన క్రేజీ కాంబినేషన్స్ ఈమధ్య కామన్ అయిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయడం ఎక్కువైపోయింది. ఇక ప్రస్తుతం ఆ వంతు ప్రభాస్, యష్ లకు వచ్చింది.

విచిత్రాలన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే జరుగుతుంటాయి. ఎప్పుడు ఎలా ఎవరి కాంబినేషన్ కలుస్తుందో చెప్పలేం. వాటినే మన ఆడియన్స్ ముద్దుగా క్రేజీ కాంబినేషన్స్ అంటుంటారు. ఇక అలాంటి కాబినేష్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో రూమర్ తెగ తిరుగుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ తో.. కన్నడ రాక్ స్టార్ స్కీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతోంది. కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమాలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఈ సినిమాలో పాన్ ఇండియా నుంచి అన్ని భాషల నటులు నటిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కన్నడ రాకింగ్ స్టార్...కెజియఫ్ హీరో యష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
కేజీఎఫ్ హీరో యశ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. యష్ కు కెజియఫ్ తో ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే.. ఇక సలార్ లో యష్ గెస్ట్ రోల్ అంటే.. సినిమా పబ్లిసిటీ ఓ రేంజ్ లో పెరుగుతుంది. ఇక తనకి కెజియఫ్ తో పాన్ ఇండియా ఇమేజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో పాటు మేకర్స్ అడగటంతో యశ్ ఈ పాత్ర చేయడానికి యస్ చెప్పాడని సమాచారం.
ఈ మధ్య స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ కామన్ అయిపోయింది. రీసెంట్ గా విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు కొద్ది సేపు సూర్య స్క్రీన్ శేర్ చేసుకున్నాడు. గతంలో కూడా ఇలాంటి గెస్ట్ రోల్స్ చూశాం. అటు బాలీవుడ్ లో కూడా షారుఖ్, సల్మాన్ ఒకరి సినిమాలలో మరొకరు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ను ఒకే స్క్రీన్ పై చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సలార్ లో యష్ కనిపిస్తే.. అటు కన్నడ నాట కూడా సలార్ కు తిరుగులేని కలెక్ష్స్ వచ్చే చాన్స్ ఉంది . ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అంతే కాదు సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందనే టాక్ కూడా ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది.