MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్

Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్

సంతోష్‌ శోభన్‌ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన `కపుల్‌ ఫ్రెండ్లీ`పై ప్రభాస్‌ రివ్యూ ఇచ్చారు. ఏకంగా `వర్షం`తో పోల్చారు. అలాగే `క్వీన్‌` టైటిల్‌ గ్లింప్స్ విడుదలయ్యింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2026, 11:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కపుల్‌ ఫ్రెండ్లీకి పాజిటివ్‌ టాక్‌
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీకి పాజిటివ్‌ టాక్‌

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన `కపుల్ ఫ్రెండ్లీ` సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం థియేటర్లోకి వచ్చింది. దీనికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. సరికొత్త లవ్‌ స్టోరీగా, స్వచ్ఛమైన రొమాంటిక్‌ డ్రామాగా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటుంది. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ధీరజ్‌ మొగిలినేని మూవీని డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కపుల్‌ ఫ్రెండ్లీకి ప్రభాస్‌ రివ్యూ
Image Credit : Prabhas\Instagram

కపుల్‌ ఫ్రెండ్లీకి ప్రభాస్‌ రివ్యూ

సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో సినిమాని చూసిన ప్రభాస్‌, తన రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని తన `వర్షం`తో పోల్చడం విశేషం. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు ప్రభాస్. తనకు `వర్షం` సినిమాలా, సంతోష్ శోభన్ కు `కపుల్ ఫ్రెండ్లీ` గుర్తుండిపోయే మూవీ అవుతుందని పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని, సినిమాని బాగా ఎంజాయ్‌ ఎంజాయ్ చేశానని తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Related image1
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Related image2
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
34
కపుల్‌ ఫ్రెండ్లీపై టీమ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీపై టీమ్‌ కామెంట్‌

మూవీ సక్సెస్‌ అయిన సందర్భంగా గోకుల్ థియేటర్ లో ఎన్నో సినిమాలు చూశాను. ఈ రోజు నేను నటించిన మూవీని ప్రేక్షకులందరితో కలిసి చూడటం సంతోషంగా ఉంది. మా సినిమాను ప్రభాస్ అన్న చూసి ప్రశంసించారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రభాస్ అన్న అప్రిషియేట్ నేను గెలిచాను అనే ఫీల్ కలిగించింది. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ, వాలెంటైన్ డే సీజన్ లో వస్తున్న పర్పెక్ట్ జానర్ మూవీ ఇది` అని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ , `మా సినిమాకి ప్రభాస్ గారి అప్రిషియేషన్ తో మేమంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. ఈ సినిమాతో సంతోష్ 2.ఓ స్టార్ట్ అవుతోంది. ఈ ఏడాది ఆయన పెద్ద హీరో అవుతారు. మానస వారణాసి పర్ ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారు. డైరెక్టర్ అశ్విన్ నెక్ట్స్ తెలుగులోనే మూవీ చేయాలి. ఆయన హైదరాబాద్ షిఫ్ట్ కావాలి. నేను ఈ సినిమా చూసినప్పుడు బాగా నమ్మాను. కపుల్ ఫ్రెండ్లీతో నేను ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేశాను` అని తెలిపారు.

44
`క్వీన్`టైటిల్ గ్లింప్స్ రిలీజ్
Image Credit : Asianet News

`క్వీన్`టైటిల్ గ్లింప్స్ రిలీజ్

సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం అవుతుంది. యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన `ఉత్తర`, `ఆర్టిస్ట్` చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు మూడో చిత్రంగా `క్వీన్‌` మూవీని రూపొందిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా `క్వీన్` సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తే ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెబుతూ.. భారత రాజ్యాంగం, ఆర్ టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివి చూపించడం `క్వీన్` సినిమా టైటిల్ గ్లింప్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ... అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు దర్శకుడు రతన్ రిషి. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Related Stories
Recommended image1
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Recommended image2
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved