- Home
- Entertainment
- జూనియర్ ఎన్టీఆర్ కోసం విశ్వామిత్రుడి అవతారం ఎత్తిన స్టార్ హీరో ఎవరు ?.. రాముడు, కర్ణుడు కూడా అతడే
జూనియర్ ఎన్టీఆర్ కోసం విశ్వామిత్రుడి అవతారం ఎత్తిన స్టార్ హీరో ఎవరు ?.. రాముడు, కర్ణుడు కూడా అతడే
జూనియర్ ఎన్టీఆర్ కోసం బడా పాన్ ఇండియా హీరో ఒకరు విశ్వామిత్రుడి పాత్రలో నటించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Jr NTR
ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఎందుకంటే ఇద్దరు హీరోలని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కించేందుకు దర్శకులు సాహసించడం లేదు. గోపాల, గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్ఆర్ఆర్ ఇలా అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు తళుక్కున మెరుస్తున్నాయి.
అయితే ఒక హీరో మరో హీరో కోసం గెస్ట్ రోల్స్ లో నటించేందుకు మాత్రం అంగీకరిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కి తిరిగి ప్రాణం పోసిన చిత్రం యమదొంగ. సింహాద్రి తర్వాత సరైన హిట్ లేకుండా క్రమంగా తారక్ మార్కెట్ క్షీణిస్తున్న తరుణంలో రాజమౌళి యమదొంగ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ మూవీలో యమధర్మరాజు పాత్రలో మోహన్ బాబు నటించారు.
Prabhas
ఎన్టీఆర్, మోహన్ బాబు ఇద్దరూ నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మూవీ మరో పాన్ ఇండియా స్టార్ కూడా నటించాడు అని ఎంత మందికి తెలుసు ? ఇండియన్ బాక్సాఫీస్ ని శాసిస్తున్న ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. యమదొంగ చిత్రం విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. యమదొంగ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు ఈ బ్యానర్ లోగో షూట్ చేశారు. బ్యానర్ లోగోపై విశ్వామిత్రుడి ఇమేజ్ ఉంటుంది. యమదొంగ చిత్రంలో విశ్వామిత్ర క్రియేషన్స్ లోగో పడే ముందు 20 సెకండ్ల పాటు ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపిస్తారు.
Prabhas
దీనికోసం ప్రభాస్ ఒక రోజు విశ్వామిత్రుడి గెటప్ వేసుకుని షూట్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రభాస్ ఇలా చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. యమదొంగ చిత్రానికి రిలీజ్ కి ముందు మంచి బజ్ తీసుకువచ్చింది. ఎన్టీఆర్ తోనే కాదు.. రాజమౌళితో కూడా ప్రభాస్ కి మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ లో పౌరాణిక పాత్రలకు పెర్ఫెక్ట్ కూడా సెట్ అయ్యే కటౌట్ ప్రభాస్ సొంతం. ప్రభాస్ ఆల్రెడీ కల్కి చిత్రంలో కర్ణుడిగా, ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా కనిపించారు.
Prabhas
భవిష్యత్తులో రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తే అందులో ప్రభాస్ తప్పకుండా కర్ణుడి పాత్రలో కనిపించాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ చిత్రం వర్కౌట్ కాలేదు. కానీ కల్కి లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించిన విధానం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఆ మూవీలో కర్ణుడి పాత్ర వల్లే 1000 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయని క్రిటిక్స్ భావిస్తున్నారు.