`కేజీఎఫ్2` రిజల్ట్ తో ప్లాన్ మార్చిన ప్రభాస్.. దసరా వరకు ఆ డైరెక్టర్ వెయిటింగ్?
`కేజీఎఫ్2` విడుదలకు ముందు `సలార్`కి గ్యాపిచ్చి మారుతి సినిమాని చేయాలనుకున్నారు డార్లింగ్. అటు `ప్రాజెక్ట్ కే`కి కూడా కొంత గ్యాప్ ఇచ్చి మారుతి సినిమాని రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా కోసం అరడజను మంది దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకొంటుండగా, మరికొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. పెళ్లిని కూడా పక్కన పెట్టి ప్రభాస్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. దాదాపు నాలుగైదేళ్ళ పాటు ఆయన క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండబోతున్నారు.
`రాధేశ్యామ్` రిజల్ట్ తర్వాత ప్రభాస్.. మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేయాలనుకున్నారు. అందుకు మారుతితో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. వినోదానికి కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు మారుతితో సినిమా అయితే తనకు కాస్త రిలీఫ్‌నిస్తుందని భావించారు.ఇటీవల వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నా ప్రభాస్ నుంచి వినోదం మిస్ అయ్యింది. ఫ్యాన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మారుతిని ఎంచుకున్నారు. మిడిల్ బడ్జెట్‌లో ఫాస్ట్ గా ఈ సినిమా చేయాలనుకున్నారు. అన్ని కుదిరితే ఏప్రిల్‌లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.
కానీ అప్పుడు, ఇప్పుడు అని పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఏప్రిల్ నుంచి మే కి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆగస్ట్ లో ప్రారంభం కాబోతుందన్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఆ ప్రాజెక్ట్ దసరాకి వెళ్లిందని టాక్. దానికి కారణం `కేజీఎఫ్2` అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ప్రశాంత్ నీల్ రూపొందించిన `కేజీఎఫ్2` సినిమా ఏప్రిల్ 14న విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రం 1200 కోట్లుపైగా కలెక్షన్లని సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్‌పై ఓ సునామీ సృష్టించింది. దీంతో ప్రభాస్ ప్లాన్ ఛేంజ్ చేశాడట.
`కేజీఎఫ్ 2` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ `సలార్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మైనింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. `కేజీఎఫ్2` సంచలనాలు క్రియేట్ చేయడంతో ప్రభాస్ ముందుగా `సలార్`ని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. `కేజీఎఫ్2` తర్వాత ఆ దర్శకుడి నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అది `సలార్`కి కలిసొచ్చే అంశం. `సాహో`, `రాధేశ్యామ్` చిత్రాలతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వారిని ఇమ్మిడియెట్‌గా ఖుషీ చేయాలంటే `సలార్`ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు ప్రభాస్.
అయితే `కేజీఎఫ్2` విడుదలకు ముందు `సలార్`కి గ్యాపిచ్చి మారుతి సినిమాని చేయాలనుకున్నారు డార్లింగ్. అటు `ప్రాజెక్ట్ కే`కి కూడా కొంత గ్యాప్ ఇచ్చి మారుతి సినిమాని రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు. కానీ `కేజీఎఫ్ 2` ఇచ్చిన ఊపుతో తన ప్లాన్ మార్చుకుని ఇప్పుడు ఫస్ట్ `సలార్`ని పూర్తి చేసే పనిలో పడ్డారట ప్రభాస్. దీంతో మారుతి చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు. ఈ కారణంగా ప్రభాస్- మారుతి సినిమా దసరా వరకు పోస్ట్ పోన్ అయ్యిందని, విజయదశమి సందర్భంగా ఆ సినిమాని ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇక ఇందులో డార్లింగ్ సరసన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంపికైందని టాక్. అలాగే ముగ్గురు హీరోయిన్లకి స్కోప్ ఉందని, `పెళ్లి సందడి` ఫేమ్ శ్రీలీలా, రాశీఖన్నాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని `ఆర్‌ఆర్‌ఆర్` ఫేమ్ డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఈ గ్యాప్‌లో మారుతిని బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండాలని ప్రభాస్ సజెస్ట్ చేసినట్టు టాక్. ఇదిలా ఉంటే ఇటీవల `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ సినిమా చేసేందుకు ప్రభాస్ ని కలవడగా, డార్లింగ్ రిజెక్ట్ చేశారని భోగట్టా.