- Home
- Entertainment
- Salaar Leaks : ‘సలార్’ సెట్ నుంచి ప్రభాస్ పిక్స్ లీక్.. షాక్ లో చిత్రయూనిట్.. తొలిరోజే చేదు అనుభవం..
Salaar Leaks : ‘సలార్’ సెట్ నుంచి ప్రభాస్ పిక్స్ లీక్.. షాక్ లో చిత్రయూనిట్.. తొలిరోజే చేదు అనుభవం..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాగా తొలిరోజే చిత్ర యూనిట్ కు చేదు అనుభవం కలిగింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. చివరిగా ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆయన అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడియెన్స్ కూడా ప్రభాస్ నుంచి మేం ఇలాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయడం లేదంటూ పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.
దీంతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఫుల్ మూవీగా ‘సలార్’ను అనౌన్స్ చేశారు ప్రభాస్. ఇప్పటికే కేజీఎఫ్ క్రియేట్ చేసిన ప్రభంజనంతో... ఇక సలార్ వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా సత్తా చూపుతుందని, ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ పక్కా అనే భావనలో ఉన్నారు. మరోవైపు ఈ సినిమాపై ఎప్పుడెప్పులు ఎలాంటి అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు.
అయితే, Salaar చిత్రయూనిట్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను ఈరోజే ప్రారంభించింది. ఈ క్రమంలో యూనిట్ లోని ఒకరు షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ పిక్స్ ను లీక్ చేశారు. ప్రభాస్ కూర్చున్న ఫొటోలు.. ఓ అమ్మాయితో మాట్లాడుతున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలాగే సలార్ సెట్ కు సంబంధించిన పిక్స్ ను కూడా లీక్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్డ్ పిక్స్ ను చూస్తుంటే ప్రశాంత్ నీల్ పెద్దగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు లోకేషన్స్ కూడా చాలా భయంకరంగా, మాస్ లుక్ కు సరిపడేలా ఉన్నాయి.
సలార్ చిత్ర షూటింగ్ ఇప్పటికే 35 పర్సంటేజ్ అయ్యింది. తాజాగా ఈ రోజే సెకండ్ షెడ్యూల్ ను కూడా ప్రారంభించడంతో ఇటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అప్పుడు కూడా కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. తాజాగా ఫస్ట్ డేనే ఇలా లీక్ ల పర్వం పునరావ్రుతం కావడంతో చిత్ర యూనిట్ షాక్ అవుతోంది.
ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి ఎన్ని లీక్ లు వచ్చాయో తెలిసిందే. అటు రామ్ చరణ్ ‘ఆర్సీ15’ నుంచి లీక్ లు వచ్చినా దర్శకుడు శంకర్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో తగ్గిపోయాయి. ప్రస్తుతం లీకర్స్ ‘సలార్’ మూవీపై పడ్డట్టు తెలుస్తోంది.
మరోవైపు చిత్ర యూనిట్ కూడ అప్డేట్స్ ఇవ్వడంలో కొంత ఆలస్యం చేస్తుండటంతో కొందరు నెటిజన్లు ఇలాంటి లీక్ లతోనే సినిమా చూసినంతటి అనుభూతి పొందుతున్నారు. ప్రభాస్ కటౌట్ కు, మాస్ లుక్ ను చూసిన అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది.
2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ (Shruthi Haasani) నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ హీరో ప్రుథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.