- Home
- Entertainment
- ప్రభాస్: బాలీవుడ్‌లో ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో.. 10 ఏళ్లలో 6 సినిమాలతో సంచలనం
ప్రభాస్: బాలీవుడ్‌లో ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో.. 10 ఏళ్లలో 6 సినిమాలతో సంచలనం
ప్రభాస్ నటించిన 'ద రాజా సాబ్' సినిమా ట్రైలర్ కాసేపట్లో రానుంది. ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ప్రభాస్ బాలీవుడ్‌లో అరుదైన ఘనత సాధించిన సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు.

1. బాహుబలి : ది బిగినింగ్ (2015)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 118.7 కోట్లు (బ్లాక్ బస్టర్)
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ నటించారు.
2.బాహుబలి 2 : ది కన్ క్లూజన్ (2017)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 510.99 కోట్లు (బ్లాక్ బస్టర్)
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' కి సీక్వెల్. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా హీరోహీరోయిన్లు. రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.
3.సాహో (2019)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 142.95 కోట్లు (హిట్)
సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ నటించారు.
4.రాధే శ్యామ్ (2022)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 19.30 కోట్లు (ఫ్లాప్)
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే, రిద్ది కుమార్, భాగ్యశ్రీ, కునాల్ కపూర్ నటించారు. ఈ చిత్రం ఆ రికార్డుని సాధించలేకపోయింది.
5.ఆదిపురుష్ (2023)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 135.04 కోట్లు (డిజాస్టర్)
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించారు.
6.సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ (2023)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 153.84 కోట్లు (సూపర్ హిట్)
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా నటించారు.
7.కల్కి 2898 AD (2024)
హిందీ వెర్షన్ కలెక్షన్లు : 294.25 కోట్లు (సూపర్ హిట్)
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటించారు.