- Home
- Entertainment
- `దేవర 2`పై అనుమానాలను ఎన్టీఆర్ క్లారిటీ.. ప్రభాస్‌కి పోటీగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్
`దేవర 2`పై అనుమానాలను ఎన్టీఆర్ క్లారిటీ.. ప్రభాస్‌కి పోటీగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్
ఎన్టీఆర్ తాజాగా దర్శకుడు కొరటాల శివతో చేయాల్సిన `దేవర 2` సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

`దేవర 2`పై తారక్ క్లారిటీ ఇదే
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజాగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. `దేవర 2` సినిమా ఉంటుందా? లేదా? అనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.
నేడు ఆదివారం( జూన్ 15న )న దర్శకుడు కొరటాల శివ పుట్టిన రోజు. ట్విట్టర్ ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు తారక్. ఈ సందర్భంగానే కొరటాలతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నట్టు వెల్లడించారు. పరోక్షంగా ఆయన `దేవర 2` కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.
త్రివిక్రమ్ తో మూవీ ప్రకటనతో `దేవర 2`పై కన్‌ఫ్యూజన్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో చివరగా `దేవర` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా, మంచి విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ లో బాగా ఆడింది. హిందీలో ఇది మంచి కలెక్షన్లని రాబట్టింది. దీంతో `దేవర 2`కి లైన్ క్లీయర్ అయ్యిందని చెప్పొచ్చు.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్టార్ట్ అని తెలిసింది. కానీ ఇటీవల త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయ్యిందనే వార్తతో `దేవర 2` క్యాన్సిల్ అయ్యిందా? అనే రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తారక్ పోస్ట్ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది.
`వార్ 2`, `డ్రాగన్`లతో రాబోతున్న ఎన్టీఆర్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఓ సారి చూస్తే, ప్రభాస్‌కి పోటీ ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే తారక్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `వార్ 2`లో నటించారు. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. దీంతోపాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్. దీనికి `డ్రాగన్` అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది ప్రథమార్థంలో రానుంది.
త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీ
ఈ మూవీ తర్వాత `దేవర 2` ఉండే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుంది. అలాగే ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా ఫైనల్ అయ్యింది. గతంలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. ఆ స్థానంలో కొరటాలతో `దేవర` వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నారు.
హారికా అండ్ హాసిని బ్యానర్‌లో ఈ మూవీ ఉండబోతుంది. మైథలాజికల్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట దర్శకుడు త్రివిక్రమ్. దీంతోపాటు అదే బ్యానర్‌లో నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ మూవీ ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఐదు సినిమాలున్నాయి.
ఆరు ప్రాజెక్ట్ లతో టాప్‌లో ప్రభాస్
టాలీవుడ్ స్టార్స్ లో ప్రభాస్‌కి ఉన్న లైనప్ మరే హీరోకి లేదు. ఆయన ఇప్పుడు `రాజా సాబ్`తో రాబోతున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` మూవీ ప్రారంభించనున్నారు. వీటితోపాటు ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయాల్సి ఉంది.
అలాగే `సలార్ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలా ఆరు సినిమాలు కమిట్ అయినవి ఉన్నాయి. వీటితోపాటు లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇలా అత్యధిక సినిమాల లైనప్‌తో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు తారక్ ఆయనకు పోటీగా వస్తుండటం విశేషం.