MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ..మొన్న కొరియా...ఇప్పుడేమో పాకిస్దాన్...తర్వాత?

ప్రభాస్ ..మొన్న కొరియా...ఇప్పుడేమో పాకిస్దాన్...తర్వాత?

ప్రభాస్ కల్కి ఘన విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోతున్న 'స్పిరిట్' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. 

3 Min read
Author : Surya Prakash
Published : Jul 23 2024, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Prabhas Pak Actress

Prabhas Pak Actress


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నారు. అతి త్వరలోనే ప్యాన్ వరల్డ్ స్టార్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆయన సినిమాల్లో వివిధ దేశాలకు చెందిన ఆర్టిస్ట్ లను తెచ్చేందుకు దర్శకులు ప్రయత్నించటమే అందుకు కారణం. మార్కెట్ విస్తరణలో భాగంగా వివిధ దేశాల్లో సినిమాలు రిలీజ్ అవ్వాలంటే అక్కడ ఆర్టిస్ట్ లు కూడా ఉంటే మంచిదని ఓ అభిప్రాయం అయితే కథలు కూడా అలా డిమాండ్ చేయటం మరో కారణం అంటున్నారు. తాజాగా ఆయన సినిమాలో పాకిస్దాన్ నటిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.మొన్న కొరియా నటుడుని విలన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

211
Prabhas

Prabhas


ప్రభాస్ కల్కి ఘన విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోతున్న 'స్పిరిట్' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశారని చెప్తున్నారు. ఇందులో నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ప్రభాస్ కనిపించబోతున్నారు.  ఇక ఈ చిత్రంలో కొరియన్-అమెరికన్ యాక్టర్ డాన్ లీ (మా డాంగ్-సియోక్) యాక్ట్ చేస్తున్నాడనే వార్తలు రావడం కూడా స్పిరిట్‌పై అంచనాలు పెంచేశాయి. అయితే   అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ  డాన్‌ లీ ఈ ప్రాజెక్ట్‌లో ఉంటే వేరే లెవల్‌లో ఉంటుందనేది నిజం.

311

ఇప్పుడు మరో న్యూస్ .  పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించ‌నుంది. అయితే ఈ సినిమా అక్టోబ‌ర్‌లో షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

411


ఆ న్యూస్ ఏమిటంటే... ఈ సినిమా కోసం పాకిస్దాన్ నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.  పాకిస్థాన్ హీరోయిన్ సజల్ అలీని చిత్ర‌యూనిట్ సంప్రదిస్తున్నట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. సజల్ అలీ ఇంత‌కుముందు బాలీవుడ్ దివంగ‌త న‌టి శ్రీదేవితో కలిసి మామ్ అనే సినిమాలో న‌టించిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో చేయ‌లేదు.

511


మ‌రోవైపు ప్ర‌భాస్ సినిమాలో పాకిస్థాన్ అమ్మాయిని పెడుతున్నారనేగానే ఇదో లవ్ స్టోరీ అని ఫిక్సైపోతున్నారు అభిమానులు. . ఈ సినిమా స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. అప్పుడు ఇండియా పాకిస్థాన్ క‌లిసి ఉన్న కాలంలో హ‌ను రాఘ‌వ‌పూడి క‌థ రాసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ  సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
 

611


అలాగే  సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఏ జానర్ లో సినిమా చేయబోతన్నారనే విషయమై హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా బయిటకు వచ్చింది. ఆ టైటిల్ మరేదో కాదు ఫౌజీ. 
 

711


ఫౌజీ అంటే అర్దం సైనికుడు. ఈ సినిమా యుద్దం నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామా కావటం విశేషం. సీతారామం కూడా దాదాపు ఇలాంటి నేపధ్యమే. ఇక ఫౌజీ అనేది వర్కింగ్ టైటిల్ అని, ప్యాన్ ఇండియా మార్కెట్ సరపడ టైటిల్ అవుతుందని ఇదే లాక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా 1947 కాలంలో జరుగుతుంది. 
 

811


బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జియర్ కథ ఇది అని సమాచారం. మైత్రీమూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ చాలా కాలంగా జరుగుతోంది. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమలో హీరోయిన్ గా కనిపించబోతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తారు. వచ్చే సంవత్సరం షూట్ మొదలయ్యే అవకాసం ఉంది. 
  

911


హను రాఘవపూడి మాట్లాడుతూ... “నా అప్ కమింగ్ ఫిల్మ్ ప్రభాస్ తోనే. అది ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇది చారిత్రక ఫిక్షన్ చిత్రం. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేసారు.  ” అని చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ తో  అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది. 
 

1011

 
ఇక  డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పటంతో ఖచ్చితంగా కొత్త కథ చూడబోతున్నారనే ఆనందం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని వినికిడి. అలాగే  యుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది.  

1111


ఈ క్రమంలో హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.  హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shakeela: వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. మంచి స్నేహితుడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడనుకోలేదు
Recommended image2
Ram Charan: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో? రామ్ చరణ్ సపోర్టుతో ఆ సినిమా సీక్వెల్‌లో?
Recommended image3
Rajamouli: రాజమౌళి జీవితాశయం, మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ ?.. ఎవరెవరు, ఏ పాత్రల కోసమో తెలుసా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved