- Home
- Entertainment
- Prabhas: నయా స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్.. `సీతారామం` ఈవెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ
Prabhas: నయా స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్.. `సీతారామం` ఈవెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ
పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన పబ్లిక్‌లోకి వచ్చారు. లేటెస్ట్ నయా లుక్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్(Prabhas) తాజాగా `సీతారామం`(SitaRamam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. స్టేజ్‌పై ఎల్‌ఈడీ స్క్రీన్ల మధ్యలో నుంచి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ మైండ్ బ్లోయింగ్‌లా ఉండటం విశేషం. యూనిట్ ఆయనకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.
ఈ సందర్బంగా Prabhas బ్లాక్ టీషర్ట్, డెనిమ్ జీన్స్ ధరించారు. నయా లుక్‌లో అదరగొడుతున్నాయి. ఆయన మీసం స్టయిల్ కూడా కొత్తగా ఉంది. `సలార్`(Salaar) లుక్‌ని తలపిస్తుంది. స్టేజ్‌పై సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఈవెంట్‌కి కళని తీసుకొచ్చారు. ఆయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
జనరల్‌గా హీరోయిన్లు ఈవెంట్లకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిస్తే ఇప్పుడు ప్రభాస్ స్పెషల్‌గా మారడం విశేషం. ప్రస్తుతం ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెండ్ అవుతున్నాయి.
ఇందులో ప్రభాస్ కి హీరో దుల్కర్ సల్మాన్ సైతం వెల్‌కమ్ చెప్పారు. ఇద్దరు ఒకే సోఫాలో కూర్చొగా అభిమానులకు ఓ పండగ వాతావరణం తీసుకొచ్చారని చెప్పొచ్చు.
ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చారు. జనరల్‌గా పబ్లిక్ ఫంక్షన్లకి ఆయన రావడం చాలా అరుదు. ఇప్పుడు అశ్వినీదత్ ప్రొడక్షన్‌లో `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో నిర్మాత ఆహ్వానం మేరకు ఆయన ఈ చిత్రానికి గెస్ట్ గా వచ్చారు.
ఇక `సీతారామం` చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించారు.
పీరియడ్ కథతో ఓ గొప్ప ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు ఇలాంటి కథతో మరే సినిమా రాలేదన్నారు దుల్కర్ సల్మాన్. రెండు టైమ్ పీరియడ్‌లో సినిమా సాగుతుందని తెలుస్తుంది. సినిమాని ఈ నెల (ఆగస్ట్) 5న విడుదల చేస్తున్నారు.
`సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ సందడి చేశారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం విశేషం.
ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత అభిమాన హీరోని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.