అమరన్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ.. మళ్ళీ ఆర్మీ నేపథ్యంలోనే కథ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంతో ప్రభాస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంతో ప్రభాస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత ఫౌజీ, స్పిరిట్ లాంటి చిత్రాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది.
అందుతున్న సమాచారం మేరకు అమరన్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ప్రభాస్‌కి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ వినిపించాడట. ఈ కథను ప్రభాస్ ఎంతో ఆసక్తిగా వినడమే కాకుండా కొన్ని మార్పులు సూచించి మరోసారి కథ వినిపించమని దర్శకుడిని కోరినట్లు సమాచారం. ప్రభాస్ కోరిన మార్పులు దర్శకుడు చేస్తే ఈ చిత్రం లాక్ అయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్టు ప్రాథమిక సమాచారం ఉంది. అయితే దీనిపై ప్రభాస్ నుంచి కానీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి నుంచి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన అమరన్ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది. ఈ చిత్రంతో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.
ప్రభాస్ ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే, ది రాజా సాబ్ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాలో ఇమాన్వీతో కలిసి నటిస్తున్నాడు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు.