ప్రభాస్ టు సన్నీ సింగ్... ఆదిపురుష్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ తెలుసా?
ఆదిపురుష్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో దిగనుంది. దీంతో ఆదిపురుష్ మూవీ గురించి ఒక్కో విశేషం వెలుగులోకి వస్తుంది.

ఆదిపురుష్ నిర్మాతలు స్టార్స్ కోసమే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే టీజర్ విమర్శలపాలు కావడంతో ఓ వంద కోట్లు కేటాయించి ఆరు నెలల పాటు మెరుగులుదిద్దారు. మొత్తంగా ఆదిపురుష్ బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువ అయ్యింది. చిత్ర బడ్జెట్ లో చాలా వరకు రెమ్యూనరేషన్స్ రూపంలో పోయింది.
ఈ మూవీలో కీలకమైన లక్ష్మణుడు పాత్ర బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ చేశాడు. ఈ పాత్రకు ఆదిపురుష్ నిర్మాతలు రూ. 1.5 కోట్లు ఇచ్చారట. గతంలో ఆయన తీసుకున్న దానికంటే ఇది అధికం అని తెలుస్తుంది.
బాలీవుడ్ లో టైర్ టూ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది కృతి సనన్. తెలుగులో రెండు చిత్రాలు చేసిన కృతి సనన్ మూవీకి రూ. 2 కోట్లు తీసుకుంటున్నారట. అయితే ఆదిపురుష్ కోసం ఆమె రూ. 3 కోట్ల వరకూ డిమాండ్ చేశారట. ఆదిపురుష్ చిత్రానికి గానూ కృతి సనన్ రెమ్యూనరేషన్ మూడు కోట్లు అంటున్నారు.
saif ali khan
ఇక ఆదిపురుష్ లో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఆయన లంకేశ్వరుడిగా కనిపించనున్నారు. ఈ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ రూ. 12 కోట్లు తీసుకున్నారట. ఒకప్పటి స్టార్ హీరోకి మేకర్స్ అంత మొత్తం ఆఫర్ చేశారట.
ఆదిపురుష్ మూవీ బడ్జెట్ లో సింహభాగం ప్రభాస్ రెమ్యూనరేషన్. బాహుబలి అనంతరం ఆయన వంద కోట్ల హీరో అయ్యారు. ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 100 నుండి 150 కోట్లు అంటున్నారు. ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న ప్రభాస్ ఇమేజ్ కి ఇది తక్కువే. అందుకే మేకర్స్ అడిగినంతా ఇస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు ఓం రౌత్ రామాయణగాథగా తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఆదిపురుష్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.