- Home
- Entertainment
- `కల్కి ` ఎక్స్ ట్రా బడ్జెట్ 200కోట్లు.. అసల కారణం ఏంటంటే?.. టోటల్ బిజినెస్ లెక్కలు
`కల్కి ` ఎక్స్ ట్రా బడ్జెట్ 200కోట్లు.. అసల కారణం ఏంటంటే?.. టోటల్ బిజినెస్ లెక్కలు
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` మూవీ బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా రెండు వందల కోట్లు ఎక్కువ కావడం షాకిస్తుంది. సినిమాకి బజ్ లేదు, మరి రికవరీ అవుతుందా?

Prabhas Kalki 2898 AD film update out
ప్రభాస్ ప్రస్తుతం `కల్కి2898ఏడీ` సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై అంతటా చర్చ జరుగుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం, భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్, సైన్స్ ఫిక్షన్‌తోపాటు మహాభారతం ఎలిమెంట్లు ఉండటం సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పొచ్చు.
`కల్కి2898ఏడీ` నుంచి ఇటీవల బుజ్జి టీజర్ వచ్చింది. ప్రభాస్ పాత్రతో సమానంగా ఉండే వెహికల్ బుజ్జి. ఈ బుజ్జిని పరిచయం చేస్తూ టీజర్ వదిలారు మేకర్స్. బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. అలాగే బుజ్జి టీజర్ కూడా ఆకట్టుకుంది. దీన్ని స్క్రాప్‌తో తయారు చేసినట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ ఈవెంట్ నుంచి మూవీపై చర్చమొదలైంది. బడ్జెట్, బిజినెస్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి రెండు వందల కోట్ల బడ్జెట్ పెరిగిందట. అనుకున్న దానికంటే 200కోట్లు ఎక్కువ అయ్యిందని సమాచారం. అదే ఇప్పుడు షాకిస్తుంది. సినిమాకి అనుకున్న బడ్జెట్ 500కోట్లు. కానీ ఇప్పుడు సుమారు 700కోట్లు అయ్యిందని టాక్. మరి ఎక్కడ పెరిగింది? ఎందుకు పెరిగింది, మరి అంతటి బడ్జెట్ రికవరీ సాధ్యమేనా? అనేది చూస్తే.
ముందుగా `కల్కి2898ఏడీ` ఎస్టిమేటెడ్ బడ్జెట్ 500కోట్లు. ఇందులో 150కోట్ల వరకు ప్రభాస్‌కి పారితోషికం రూపంలో వెళ్తుంది. వీరితోపాటు అమితాబ్ బచ్చన్, దీపికి పదుకొనె, దిశాపటానీ, ఇతర కాస్టింగ్ అందరికి మరో వంద కోట్ల వరకు ఉంటుంది. మేకింగ్ కాస్ట్ 250కోట్లు ఉంటుంది. సినిమా డిలే కావడం, వీఎఫ్‌ఎక్స్ ఉన్న మూవీ కావడంతో బడ్జెట్ పెరిగింది. బుజ్జి కోసమే భారీగా ఖర్చు చేశారట. సెట్ వర్క్ కి కూడా భారీగానే అయ్యిందని సమాచారం.
ఇక పెరిగిన బడ్జెట్ ఎందుకంటే.. మొదట్లో లేని భారీ కాస్టింగ్ తర్వాత యాడ్ కావడమే. ప్రారంభంలో ఇందులో కమల్ హాసన్ లేడు, అలాగే గెస్ట్ రోల్స్ చేసే విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్, నయనతార, రానాలు లేరు. వీరు తర్వాత యాడ్ అయ్యారు. ఈ మూవీకి కమల్‌కి 50కోట్లు ఇస్తున్నారట. ఇతర గెస్ట్ కాస్టింగ్ కోసం మరో యాభై కోట్ల వరకు అవుతుంది. ఇలా వంద కోట్లు పెరిగింది.
దీనికితోడు ప్రమోషన్స్ కోసం యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారట. దేశ వ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారట. దేశంలోని ప్రధాన నగరాల్లో మూవీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. వీటితోపాటు సినిమా రిలీజ్ వరకు వడ్డీలు పెరగడం ఇలా అన్నీ కలిప సుమారు 700కోట్లు అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
సినిమా బిజినెస్ కూడా భారీగా అయ్యింది. బిజినెస్ పరంగా `కల్కి2898ఏడీ` నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 900కోట్లు అంటున్నారు. ఓటీటీ రూపంలోనే 375కోట్లు వచ్చిందట. నార్త్ లో నెట్ ఫ్లిక్స్ 175కోట్లకి హక్కులు తీసుకుందని, సౌత్‌లో 200కోట్లకి అమెజాన్ ఓటీటీ హక్కులను తీసుకుందట. అలాగే శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ అన్ని కలిసి మరో 75కోట్లు ఉంటుందని, ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 450కోట్లు వచ్చాయట.
Kalki 2898 AD
అలాగే థియేట్రికల్‌గా మరో 450కోట్లు ఉంటుందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో 190కోట్లు, నార్త్ లో 110కోట్లు, తమిళం, కన్నడ, మలయాళంలో మరో 60కోట్లు, ఓవర్సీస్ వంద కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. బిజినెస్ పరంగా నిర్మాత సేఫ్‌లోనే ఉంటారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న నెంబర్స్ కూడా బిజినెస్ కష్టమని అంటున్నారు. కొంత తగ్గే అవకాశం ఉందట. ఎంత కొట్టినా 400 ప్లస్‌లో ఉంటుందని టాక్.
Dune Kalki 2898 AD
నిర్మాతకు బిజినెస్ పరంగా రికవరీ ఉంటుంది. కానీ సినిమాని కొన్న బయ్యర్లకి రికవరీ సాధ్యమేనా అనేది డౌట్. ఎందుకంటే మూవీకి బజ్ రావడం లేదు. ఏ కంటెంట్ ఇచ్చినా హైప్ క్రియేట్ కావడం లేదు. మొన్న బుజ్జి టీజర్ వచ్చాక మరింత అనుమానాలు కలుగుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్‌పైనే ఇప్పటివరకు ఆశలున్నాయి. బాగా చేయగలడు అనే నమ్మకం ఉంది. ఏదైనా సినిమా మాట్లాడాలనే ధోరణి ఉండేది. కానీ విడుదల చేస్తున్న కంటెంట్ చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కనెక్ట్ కావడం కష్టమే అనే డౌట్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.