- Home
- Entertainment
- ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ కోసం రెస్ట్ లెస్ గా వర్క్ చేస్తున్న ప్రభాస్.. భారీ చిత్రాల న్యూ షెడ్యూల్ ఇదే..
‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ కోసం రెస్ట్ లెస్ గా వర్క్ చేస్తున్న ప్రభాస్.. భారీ చిత్రాల న్యూ షెడ్యూల్ ఇదే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘రాధే శ్యామ్’తో కాస్తా డిజపాయింట్ చేసినా.. తదుపరి భారీ చిత్రాల కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించేందుకు గట్టిగానే శ్రమిస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘రాధే శ్యామ్’ చిత్రంతో మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన అభిమానులను కాస్తా డిజపాయింట్ చేశారు. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా వాటిని రీచ్ కాలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రాలతో లెక్క సరిచేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ చిత్రంతో ఆయనకు ఇండియాతో పాటు ఇతర దేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. అప్పటి నుంచి ప్రభాస్ సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ‘బాహుబలి’ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు ‘సాహో’, ‘రాధ్యే శ్యామ్’ అభిమానులకు కావాల్సినంత జోష్ ను ఇవ్వలేకపోయాయి.
దీంతో డార్లింగ్ తన తదుపరి చిత్రాలతో ఎలాగైనా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోవాలని.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన నటిస్తున్న తదుపరి చిత్రాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ దాదాపు మూడు నెలలు రెస్ట్ లెస్ గా వర్క్ చేస్తున్నారు. ఏమాత్రం సమయం వేస్ట్ కాకుండా షూటింగ్ పార్ట్ లను పూర్తి చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ రోజుతో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న Salaar షూటింగ్ షెడ్యూల్ పూర్తి కానుంది. మరో పదిహేను రోజుల పాటు చిత్ర యూనిట్ ఇతర ఆర్టిస్ట్ లతో వర్క్ చేయనున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న సలార్.. త్వరలో మరో న్యూ షెడ్యూల్ ను ప్రారంభించనుంది. ఈ చిత్రంపైనే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.
ఈ రోజుతో సలార్ షెడ్యూల్ పూర్తి కానుండటంతో.. ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం Project K న్యూ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించనున్నట్టు సమాచారం. ఇలా ప్రభాస్ ఈ రెండు భారీ చిత్రాలను ప్యార్లల్ గా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉండగా.. సెలవు లేకుండా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో నటించిన మరో భారీ చిత్రం ‘ఆది పురుష్’ (Adipurush). ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. సీత పాత్రను బాలీవుడ్ బ్యూటీ క్రుతి సనన్ పోషించింది. దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న చిత్రం రిలీజ్ కానుంది.