MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ ఖాతాలో నాలుగు 500కోట్ల చిత్రాలు.. అయినా షారూఖ్‌ కంటే వెనకబడ్డ డార్లింగ్‌‌.. `కల్కి` బ్రేక్ చేస్తుందా?

ప్రభాస్‌ ఖాతాలో నాలుగు 500కోట్ల చిత్రాలు.. అయినా షారూఖ్‌ కంటే వెనకబడ్డ డార్లింగ్‌‌.. `కల్కి` బ్రేక్ చేస్తుందా?

ప్రభాస్‌ పేరుతో సరికొత్త రికార్డులు క్రియేట్‌ అవుతున్నాయి. కానీ అంతిమంగా మాత్రం ఆయన షారూఖ్‌ ఖాన్‌తో పోల్చితే వెనకబడ్డాడు. దాన్ని `కల్కి` బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 06 2024, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. భారీ కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతుంది. నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్ బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. సినిమాలోని మహాభారతం ఎలిమెంట్లు హైలైట్‌గా నిలిచాయి. తాజాగా టీమ్‌ లేటెస్ట్ కలెక్షన్లని ప్రకటించింది. 800కోట్లు దాటినట్టుగా తెలిపింది. అయితే ఫేక్‌ కలెక్షన్లు అనే చర్చ కూడా సోషల్‌ మీడియాలో నడుస్తుంది. సుమారు 130-150కోట్లు మ్యానేజ్‌ చేస్తున్నారని అంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏదేమైనా ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచాడు. ఆయన సినిమా నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి. `బాహుబలి 2` రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో `కల్కి 2898 ఏడీ` నిలిచింది. ఇది రూ.800కోట్లు వసూలు చేసిందని టీమ్‌ ప్రకటించింది. `బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్‌` రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్‌. ఇదొక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. 
 

36

అంతేకాదు నార్త్ అమెరికాలో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది `కల్కి`. ఓవర్సీస్‌లో ఇప్పుడు ప్రభాస్‌ కింగ్‌గా నిలిచారు. అలాగే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమ రికార్డు కూడాప్రభాస్‌ పేరుతో ఉంది. మొదటి రోజు కలెక్షన్ల విషయంలో టాప్‌ 10లో ప్రభాస్‌ నటించిన ఐదు సినిమాలుండటం విశేషం. వీటితోపాటు చాలా చోట్ల ఈ సినిమా పాత అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. మరే హీరోకి సాధ్యం కాని రికార్డులను క్రియేట్‌ చేస్తుండటం మరో విశేషం.
 

46

కానీ ఓ విషయంలో వెనకబడ్డాడు ప్రభాస్‌. కలెక్షన్ల పరంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల విషయంలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌తో పోల్చితే ప్రభాస్‌ వెనకబడ్డాడు. ఆయన ఖాతాలో రెండు వెయ్యి కోట్లు దాటిని చిత్రాలు ఉన్నాయి. కేవలం షారూఖ్‌ కి మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. అది కూడా గతేడాది లోనే కావడం విశేషం. ఆయన `పఠాన్‌`, `జవాన్‌` చిత్రాలతో బ్యాక్‌టూ బ్యాక్‌ ఇండియన్‌ బాక్సాఫీసులో దుమ్ములేపాడు. 
 

56

`పఠాన్‌` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1050కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని సాధించింది. ఆ తర్వాత వచ్చిన `జవాన్‌` మరింతగా రచ్చ చేసింది.ఈ మూవీ ఏకంగా రూ.1148కోట్లు వసూలు చేసింది. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేశారు షారూఖ్‌. ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రభాస్‌ కి సాధ్యమని తెలుస్తుంది. ఇప్పటికే `కల్కి` ఎనిమిది వందల కోట్లకు చేరిందంటే రెండో వారంలో ఇది వెయ్యి కోట్లు దాటుతుంది. ఈ లెక్కన ఇప్పుడు `బాహుబలి 2` తర్వాత `కల్కి` చిత్రం వెయ్యి కోట్లు దాటిని సినిమాల జాబితాలో చేరుతుంది. ఓరకంగా ఇది షారూఖ్‌ రికార్డుని సమం చేయనుందని చెప్పాలి. మరి అది ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుంది. లాంగ్‌ రన్‌లో `కల్కి` ఇంకా ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందనేది చూడాలి. 
 

66

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన `కల్కి 2898 ఏడీ` చిత్రంలో ప్రభాస్‌ భైరవ పాత్రలో, అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ హాసన్‌, సుమతి(అమ్మ)గా దీపికా పదుకొనె, రాక్సీగా దిశా పటానీ, ఇంటి హోనర్‌గా బ్రహ్మానందం, రెబల్ టీమ్‌ నుంచి రాజేంద్రప్రసాద్‌, రెబల్ నాయకురాలుగా శోభన, గెస్ట్ రోల్స్ లో అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ, పైలట్‌ కమాండర్‌గా  దుల్కర్ సల్మాన్‌, అలాగే రాజమౌళి, ఆర్జీవీ, మృణాల్‌ ఠాకూర్‌, అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా వంటి వారు నటించారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విసయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
నాగ్ అశ్విన్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Collection: పెద్ది 7 రోజుల కలెక్షన్స్, స్లో అయిన రామ్ చరణ్ సినిమా వసూళ్లు.. ఎంత వచ్చాయంటే?
Recommended image2
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved