ప్రభాస్ అప్పుల్లో కూరుకుపోయినప్పుడు అంత జరిగిందా.. రాజమౌళి పాత్ర ఏంటంటే..
అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎపిసోడ్ ని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు లాంటి విషయాలని బాలయ్య ప్రభాస్ నుంచి చాలా తెలివిగా రాబట్టారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో స్టార్ హీరోలు, యువ హీరోలు హాజరయ్యారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాలయ్య టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ ఎపిసోడ్ నిన్నటి నుంచే ఆహా యాప్ లో ప్రసారం మొదలైంది. ముందుగా రాత్రి 9 గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ ని ప్రసారం చేస్తామని ఆహా సంస్థ తెలిపింది. ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆహా యాప్ పై అన్ స్టాపబుల్ షో కోసం ఎగబడడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి. ఆహా యాప్ క్రాష్ కావడంతో సేవలని ఆలస్యంగా పునరుద్దించారు.
ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎపిసోడ్ ని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు లాంటి విషయాలని బాలయ్య ప్రభాస్ నుంచి చాలా తెలివిగా రాబట్టారు. ప్రభాస్ కూడా తగ్గలేదు. బాలయ్య ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మధ్యలో రాంచరణ్ తో జరిగిన ఫోన్ సంభాషణ హైలైట్ అని చెప్పొచ్చు.
ఇక ప్రభాస్ తన కెరీర్, ఫ్యామిలీ విషయాలని కూడా బాలయ్యతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా హీరో. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల పైనే ఉంటుందని టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.
అయితే అంతకు ముందు ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ హీరో. రెబల్ స్టార్ కృష్ణంరాజు రూపంలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. అయినా బాహుబలి ముందు వరకు ప్రభాస్ కి అప్పులు ఉండేవట. ఈ విషయాన్ని ప్రభాస్ అన్ స్టాపబుల్ లో రివీల్ చేశారు.
అప్పుడే రాజమౌళి బాహుబలి ప్లానింగ్ మొదలు పెట్టారు. బాహుబలి పెద్ద ప్రాజెక్ట్ కావడంతో మరో చేయాలంటే ఆలోచించాల్సి వచ్చేది. బహుబాలి ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతుండడంతో 'రెబల్' చిత్రంలో నటించేందుకు రాజమౌళి పర్మిషన్ అడిగాను. కొంచెం అప్పులు ఉన్నాయి.. తీర్చడానికి రెబల్ సినిమా చేయాలి అని చెప్పాను.
రెబల్ అయ్యాక మిర్చి కోసం మరోసారి రాజమౌళి అనుమతి తీసుకున్నా. మనవాడు ఎలాగూ లేటే కదా.. మిర్చి కూడా చేసేయ్ అని రమా గారు అన్నారు. తన స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావాలని ప్రయత్నిస్తున్నారు. సొంతంగా బ్యానర్ ఉంటే బావుంటుందనిపించింది. దీనితో యువీ క్రియేషన్స్ ప్రారంభించి అందులోనే మిర్చి చేశాం. మిర్చి పెద్ద హిట్ అయింది అని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.