- Home
- Entertainment
- Salaar:ట్రైలర్ లో శృతి హాసన్ కి ఒక్క డైలాగ్ మాత్రమే.. సినిమాలో అంత ఉందా, ప్రభాస్ కామెంట్స్
Salaar:ట్రైలర్ లో శృతి హాసన్ కి ఒక్క డైలాగ్ మాత్రమే.. సినిమాలో అంత ఉందా, ప్రభాస్ కామెంట్స్
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ చిత్రం డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి ఇక రెండు రోజులే టైం ఉంది. మొదటి ట్రైలర్ డిజప్పాయింట్ చేసినప్పటికీ సెకండ్ ట్రైలర్ దుమ్ము దులిపేసింది.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ చిత్రం డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి ఇక రెండు రోజులే టైం ఉంది. మొదటి ట్రైలర్ డిజప్పాయింట్ చేసినప్పటికీ సెకండ్ ట్రైలర్ దుమ్ము దులిపేసింది.
అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగుతున్నాయి. టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద క్యూ కట్టడం.. కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే సలార్ చిత్రంతో ప్రశాంత్ నీల్ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న మానియా చూస్తుంటే ఓపెనింగ్ కలెక్షన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా సునామి సృష్టించబోతున్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు షాకిస్తున్నాయి. ఇదిలా ఉండగా సలార్ జోష్ మరింత పెంచేందుకు రాజమౌళి రంగంలోకి దిగారు. సలార్ త్రయం ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ లని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సలార్ చిత్రంలో అనేక విషయాలని అడిగి తెలుసుకున్నారు.
రాజమౌళి శృతి హాసన్ గురించి అడిగిన ప్రశ్న.. దానికి ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ట్రైలర్ శృతి హాసన్ కి కేవలం ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది. ఒక్క షాట్ లో మాత్రమే ఆమె కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం ప్రభాస్, పృథ్వీ రాజ్ లే కనిపిస్తారు. ఇంత పెద్ద సినిమాలో శృతి హాసన్ కి అసలు స్క్రీన్ స్పేస్ లేదా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
కానీ రాజమౌళి ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సలార్ చిత్రం ఎలివేషన్స్ కంటే డ్రామా ప్రధానంగా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు. తనకి, పృథ్వీ రాజ్ కి మధ్య ఉండే డ్రామా ఆకట్టుకుంటుంది. అలాగే తల్లి పాత్రకి తనకి, శృతి హాసన్ కి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని ప్రభాస్ పేర్కొన్నాడు.
రాజమౌళి మాట్లాడుతూ శృతి హాసన్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఆ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారంటే ఫ్యాన్స్ తప్పకుండా ఒక డ్యూయెట్, డ్యాన్స్ నంబర్ ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో డ్యాన్స్ నంబర్ ఎందుకు లేదు అని ప్రశ్నించారు.
ప్రశాంత్ నీల్ సమాధానం ఇస్తూ షూటింగ్ బిగినింగ్ లో ఒక మాస్ సాంగ్ పెట్టాలని అనుకున్నాం. కానీ ఈ చిత్రంలో డ్రామానే ఎక్కువగా ఉంటుంది. శృతి హాసన్ ని గ్లామర్ కోసం వాడుకోవాలని అనిపించలేదు. మాస్ సాంగ్ వద్దు.. డ్రామానే ఎలివేట్ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రశాంత్ నీల్ తెలిపారు. ఏది ఏమైనా సలార్ చిత్రంలో శృతి హాసన్ బలమైన పాత్ర పోషిస్తోంది అని ప్రశాంత్ నీల్, ప్రభాస్ మాటలతో అర్థం అయింది.