ఆ ఒక్క మూవీ మూడు సింహాద్రిలతో సమానం..ఎన్టీఆర్ తనని డామినేట్ చేస్తున్నాడని ప్రభాస్ ఫీల్ అయ్యాడు తెలుసా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. తదుపరి ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జరుగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. తదుపరి ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జరుగుతోంది. సింహాద్రి తర్వాత వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల ఎన్టీఆర్ కి ఒక దశలో ఎలాంటి చిత్రాలు చేయాలో అర్థం కాలేదు. దీనితో దీనితో తారక్ కి వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి.
యమదొంగ నుంచి ఎన్టీఆర్ కాస్త రూట్ మార్చారు. కొంచెం యూత్ టచ్ ఉన్న సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రం తెరకెక్కింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదొక మెమొరబుల్ మూవీ. ఎందుకంటే అప్పటి వరకు ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ వేరు.. ఈ చిత్రంలో కనిపించింది వేరు. వంశీ పైడిపల్లి కంప్లీట్ గా తారక్ ని మార్చేశారు.
బృందావనం ఆడియో లాంచ్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రభాస్ మాట్లాడుతూ.. టైటిల్ బృందావనం అని సాఫ్ట్ గా పెట్టారు. కానీ ఈ మూవీ సింహాద్రిలు కలిపితే ఎలా ఉంటుందో ఆ వింధంగా ఉండేలా ఉంది. ఎన్టీఆర్ ని ఉద్దేశించి సరదాగా ప్రభాస్ కామెంట్ చేశారు. నువ్వు సూపర్ మాస్ హీరోలా ఉండేవాడిని.. కానీ ఈ చిత్రంలో మరీ అందంగా ఉన్నావయ్యా..
నేను వర్షం, డార్లింగ్ లాంటి సినిమాలు చేసి అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నువ్వు లుక్ మార్చి మొత్తం లాగేస్తున్నావు. నన్ను డామినేట్ చేస్తున్నావు అంటూ ప్రభాస్ కామెంట్స్ చేశాడు.
ప్రభాస్ అన్నట్లు మూడు సింహాద్రిలు అంత స్థాయి చిత్రం బృందావనం కాదు కానీ మంచి హిట్ గా నిలిచింది. అప్పట్లో ప్రభాస్ కి మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ఇప్పుడు ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ప్రభాస్ అయితే పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తిరుగులేని స్టార్ గా అవతరించారు.