- Home
- Entertainment
- దీపికా పదుకునేపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఆమెలో అదే నచ్చిందట, వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
దీపికా పదుకునేపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఆమెలో అదే నచ్చిందట, వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
ప్రభాస్ కు కాస్త సిగ్గెక్కువ అంటుంటారు ఇండస్ట్రీలో. అమ్మాయిలతో మాట్లాడాలంటే.. సిగ్గుపడుతుంటారు అని అంటుంటారు. అటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?

ప్రపంచ స్థాయిలో హీరోగా గుర్తింపు సాధించిన పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి మూవీ కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో ..పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతోంది. మహానటి సినిమాతో డైరెక్టర్ గా తనను తాను నిరూపించుకున్న నాగ్ అశ్వీన్.. ఈసారి కాస్త రిస్క్ తీసుకుని భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు.
Project K
ఇండియాలో అగ్ర నటులుగా పేరున్న కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటివారు కీలక పాత్రలు చేస్తున్న కల్కి 2898 ఏడి మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతుననట్టు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై సి. అశ్వినిదత్ భారీ భడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ఈసినిమాకు దాదాపు 500 కోట్ల వరకూ బడ్జెట్ పెడుతుననట్టు తెలుస్తోంది. ఇటీవల అమెరికా శాండియాగో లోని కామిక్ కాన్ వేదికగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. సినీ ప్రియులంతా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈక్రమంలో ప్రభాస్ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ హీరోయిన్ దీపికా ఫై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీపికా అద్భుత అందంతో పాటు ఆకట్టుకునే అభినయం గల గొప్ప సూపర్ స్టార్ అని అన్నారు. ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన వెంటనే అంతా సందడి నెలకొంటుందని కితాబిచకచాడు.
<p>Prabhas, deepika</p>
అసలే చాలా సిగ్గరిగాపేరున్న ప్రభాస్ హీరోయిన్ దీపికా ఈ కామెంట్స్ చేయడం అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంది అంతే కాదు.. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రభాస్. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగ అశ్విన్ సహా టీమ్ ఈసినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు మరి కల్కి 2898 ఏడి మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.