- Home
- Entertainment
- Prabhas: ప్రభాస్ హీరోయిన్ కృతి అరాచకం... బోల్డ్ ఫోజులతో జనాల మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ బ్యూటీ
Prabhas: ప్రభాస్ హీరోయిన్ కృతి అరాచకం... బోల్డ్ ఫోజులతో జనాల మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon)అరాచకానికి పూనుకుంది. సోషల్ మీడియా జనాల పై దయ లేకుండా గ్లామర్ తో దాడి చేసింది. నిలువెత్తు అందాల పొడుగుకాళ్ల సుందరి బోల్డ్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేసింది. వైట్ ట్రెండీ వేర్ లో కృతి ఓవర్ డోస్ గ్లామర్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
మహేష్ (Mahesh babu)మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేశారు. కాలేజ్ స్టూడెంట్ గా కృతి అదరగొట్టారు. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.
హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 వంటి హిట్ చిత్రాలు ఆమెను బాలీవుడ్ లో విజయాలు అందించారు. 2019 ఆమెకు బాగా కలిసొచ్చింది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో అవకాశం రావడంతో పాటు, హిట్స్ దక్కాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం కృతి సనన్ చేతిలో రెండు భారీ చిత్రాలతో కలిపి మొత్తం మూడు చిత్రాలున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ తో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న గణపత్ మూవీ చేస్తున్నారు. గణపత్ రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం.
ఇక ప్రభాస్ (Prabhas)ఆదిపురుష్ మూవీలో కృతి జానకి పాత్ర చేస్తున్నారు. దర్శకుడు ఓమ్ రౌత్ పాన్ ఇండియా చిత్రంగా ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నారు. ఆదిపురుష్ (Adipurush)రామాయణ గాధ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. ఆదిపురుష్ ఆగష్టు 25న విడుదల కానుంది.
కృతి కెరీర్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఓవర్ గ్లామర్ డోస్ కుమ్మరిస్తూ ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తుంది. కృతి లేటెస్ట్ ఫోటోలు అయితే మరీ అరాచకం అని చెప్పాలి. అమ్మడు నిలువెత్తు అందాలు పిచ్చెక్కిస్తున్నాయ్.